Share News

CM Chandrababu : ‘షిప్‌ యార్డు’ పెట్టండి

ABN , Publish Date - Feb 05 , 2025 | 05:08 AM

హిగాకీతోపాటు జపాన్‌కు చెందిన ప్రముఖ ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వె్‌స్ట్‌మెంట్‌ కంపెనీ సోజిట్జ్‌ సంస్థ ప్రతినిధి నిషిమురా కూడా చంద్రబాబును కలిశారు.

CM Chandrababu : ‘షిప్‌ యార్డు’ పెట్టండి

  • అతిపెద్ద జపాన్‌ షిప్‌ బిల్డింగ్‌ సంస్థ ప్రెసిడెంట్‌కు సీఎం సూచన

అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): జపాన్‌లో అతిపెద్ద షిప్‌ బిల్డింగ్‌ సంస్థ ఇమాబరీ షిప్‌బిల్డింగ్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ యుకిటో హిగాకీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. హిగాకీతోపాటు జపాన్‌కు చెందిన ప్రముఖ ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వె్‌స్ట్‌మెంట్‌ కంపెనీ సోజిట్జ్‌ సంస్థ ప్రతినిధి నిషిమురా కూడా చంద్రబాబును కలిశారు. ఈ భేటీపై చంద్రబాబు ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ఏపీలో షిప్‌ బిల్డింగ్‌కు, షిప్‌ మెయింటెనెన్స్‌ యార్డుల ఏర్పాటుకు అపారమైన అవకాశాలను జపాన్‌ సంస్థ ప్రతినిధులకు వివరించినట్లు తెలిపారు. షిప్‌ బిల్డింగ్‌లో స్థానిక యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా ఈ రంగంలో ఉన్న డిమాండ్‌ను అధిగమించవచ్చని సూచించినట్లు తెలిపారు. త్వరలోనే వారు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.

Updated Date - Feb 05 , 2025 | 05:09 AM