Polavaram: బనకచర్లకు నిధులు అందించండి
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:41 AM
రూ. 80,112 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన చెప్పారు.

అనుసంధానంతో ఏపీలో కరువు మాయం: బాలశౌరి
న్యూఢిల్లీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా ఆర్థిక సహాయం అందించాలని జనసేన పార్లమెంటరీ పార్టీ నేత వల్లభనేని బాలశౌరి గురువారం అఖిలపక్ష సమావేశంలో అభ్యర్థించారు. రూ. 80,112 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన చెప్పారు. గోదావరి, కృష్ణా జలాల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో కరువు అనేది ఉండదని, ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం గ్రాంట్‌ల రూపేణా నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. కాగా, రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు దాటినా.. విభజనకు సంబంఽధించిన అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని, వీటిపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు. కౌలు రైతులకు రుణాలు అందించేందుకు ప్రత్యేక చట్టం చేయాలన్నారు. మాదకద్రవ్యాల నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, లేకపోతే అనేక మంది పిల్లలు తప్పుదారి పడతారని బాలశౌరీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News