Share News

Pithapuram: జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 25 , 2025 | 05:07 AM

పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలను పార్టీ ప్రారంభించింది.

Pithapuram: జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు

  • పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలు

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలను పార్టీ ప్రారంభించింది. సభ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. ఈ క్రమంలో 10 కమిటీలను ఏర్పాటు చేశారు. లాజిస్టిక్స్‌, సభ నిర్వహణ, పబ్లిసిటీ, మెడికల్‌, మీడియా ఇలా ప్రతి విభాగానికి కమిటీలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు. పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పీఓసీలు, మండలాధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి వేడుకలను విజయవంతం చేసే బాధ్యతను వారికి అప్పగించారు. విశాఖపట్నం పార్లమెంట్‌కు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్‌, కాకినాడ పార్లమెంట్‌కు తుమ్మల రామస్వామి(బాబు), విజయవాడ పార్లమెంట్‌కు సామినేని ఉదయభాను, తిరుపతికి ఆరణి శ్రీనివాసులను సమన్వయకర్తలుగా నియమించారు.

Updated Date - Feb 25 , 2025 | 05:07 AM