Share News

Pithapuram : పిఠాపురంలోనే జనసేన ఆవిర్భావ వేడుకలు

ABN , Publish Date - Feb 18 , 2025 | 04:54 AM

వేడుకలను మార్చి 14వ తేదీన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది.

Pithapuram : పిఠాపురంలోనే జనసేన ఆవిర్భావ వేడుకలు

పీఏసీ నిర్ణయానికి అధినేత పవన్‌ ఆమోదం

అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. దీనికి పార్టీ అధినేతగా పవన్‌ల్యాణ్‌ అంగీకారం తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్టైక్‌రేట్‌తో జనసేన పార్టీ విజయబావుటా ఎగుర వేసింది. ఎన్నికల అనంతరం నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ కావడంతో ఈ వేడుకలను పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సందర్భంగా పిఠాపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Feb 18 , 2025 | 04:54 AM