Share News

చట్టం తన పని తాను చేస్తోంది: బాలశౌరి

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:47 AM

ఏపీ మద్యం కుంభకోణంలో చట్టం తనపని తాను చేస్తోందని, మిథున్‌ రెడ్డి అరెస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి అన్నారు.

చట్టం తన పని తాను చేస్తోంది: బాలశౌరి

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ మద్యం కుంభకోణంలో చట్టం తనపని తాను చేస్తోందని, మిథున్‌ రెడ్డి అరెస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి అన్నారు. ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన హామీలపై చర్చ జరగాలని, హామీలన్నీ అమలు చేయాలని కోరారు. జల జీవన్‌ మిషన్‌ పథకాన్ని పొడిగించాలని, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని కోరినట్టు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తే తాగునీటికి, సాగుకు ఉపయోగపడుతుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 04:48 AM