Share News

Tulasi Reddy : పోలీసులపై జగన్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరం

ABN , Publish Date - Feb 20 , 2025 | 06:08 AM

జగన్మోహన్‌రెడ్డి పోలీసులపై, అధికారులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం, ఆక్షేపణీయమని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌.తులసిరెడ్డి అన్నారు.

Tulasi Reddy : పోలీసులపై జగన్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరం

  • ప్రస్తుత పరిస్థితుల్లో పులివెందులలో గెలవడమూ కష్టమే: తులసిరెడ్డి

వేంపల్లె, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): జగన్మోహన్‌రెడ్డి పోలీసులపై, అధికారులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం, ఆక్షేపణీయమని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌.తులసిరెడ్డి అన్నారు. బుధవారం వేంపల్లెలో మాట్లాడారు. ‘‘పార్టీ అధ్యక్షునిగా తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలు వద్దకు పోయి పరామర్శించడం తప్పుకాదు. కానీ అది అక్రమకేసని, వంశీ సచ్ఛీలుడని వెనకేసుకు రావడం సమంజసం కాదు. కేసు అక్రమమా, సక్రమమా అన్నది కోర్టులో తేలుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పులివెందులలో జగన్‌ గెలవడమే కష్టం’ అన్నారు.

Updated Date - Feb 20 , 2025 | 06:08 AM