జగన్ బెదిరింపులకు బెదరం: మంత్రి సవిత
ABN , Publish Date - May 25 , 2025 | 05:29 AM
మంత్రి సవిత అన్నారు, జగన్ బెదిరింపులకు రాష్ట్రంలో ఎవరూ భయపడరని. అవినీతి, దాడుల విషయాలు రాష్ట్ర ప్రజలకు స్పష్టం అని తెలిపారు.
పెనుకొండ టౌన్, మే 24(ఆంధ్రజ్యోతి): ‘అమెరికాలో ఉన్నా, బాత్రూమ్‌లో ఉన్నా ఈడ్చుకొచ్చి కొడతాం అని జగన్ అంటున్నారు. ఆయన బెదిరింపులకు రాష్ట్రంలో భయపడేవారు ఎవరూ లేరు’ అని మంత్రి సవిత అన్నారు. పుట్టపర్తిలో జరిగే శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ మినీ మహానాడులో పాల్గొనేందుకు వెళుతూ... పెనుకొండలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎవరు ఎవరిపై దాడులు చేశారో, ఎవరు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే తెలుసు. ల్యాండ్, మైన్, వైన్.. దేన్నీ వదలకుండా దోచుకున్నారు.’ అని మంత్రి సవిత మండిపడ్డారు.