Minister Sathyakumar: డయాలసిస్ రోగుల పెరుగుదలకు జగన్ బ్రాండ్లే కారణం
ABN , Publish Date - May 04 , 2025 | 04:55 AM
రాష్ట్రంలో డయాలసిస్ రోగుల సంఖ్య పెరిగేందుకు జగన్ మద్యం బ్రాండ్లే కారణమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో రెండు డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించారు
ఆ మద్యం తాగి అనేకమంది మృతి: మంత్రి సత్యకుమార్
నెల్లూరు జిల్లాలో రెండు డయాలసిస్ కేంద్రాలు ప్రారంభం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో డయాలసిస్ రోగుల సంఖ్య పెరగడానికి జగన్ మద్యం బ్రాండ్లే కారణమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్‌యాదవ్ అన్నారు. శనివారం నెల్లూరు జిల్లా వింజమూరు, పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో డయాలసిస్ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గతంలో 18 వేల మంది ఉన్న డయాలసిస్ రోగులు 2019-24 సంవత్సరాల్లో 81 వేలకు పెరిగారని తెలిపారు. రాష్ట్రంలో 42 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా మరో 18 ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తామంటున్న కూటమి ప్రభుత్వ హామీలో లొసుగులు వెతకటానికి వైసీపీ విఫలయత్నం చేసిందని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు.