Share News

ISRO: రేపే నింగిలోకి రీశాట్‌-1బీ

ABN , Publish Date - May 17 , 2025 | 04:31 AM

దేశ భద్రతకు కీలకమైన రీశాట్‌-1బీ రాడార్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఆదివారం ఉదయం శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ-సీ61 ద్వారా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు.

ISRO: రేపే నింగిలోకి రీశాట్‌-1బీ

పీఎ్‌సఎల్వీ-సీ61 ద్వారా ప్రయోగం

నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

సూళ్లూరుపేట, తిరుమల, మే 16 (ఆంధ్రజ్యోతి): సరిహద్దుల్లో నిఘా సామర్థ్యాన్ని పెంచి, దేశ భద్రతను పటిష్ఠం చేసే అత్యాధునిక రాడార్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం రీశాట్‌-1బీ ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ వేదికగా ఆదివారం ఉదయం 5:59 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ61 రాకెట్‌ ద్వారా ఈవోఎస్‌-09 (రీశాట్‌-1బీ) ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ శనివారం ఉదయం 7:59 గంటలకు ప్రారంభించనున్నారు. 22 గంటలపాటు కొనసాగే ఈ కౌంట్‌డౌన్‌ ముగిసిన వెంటనే షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ61 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్తుంది. నాలుగు దశల అనుసంధాన పనులు పూర్తిచేసుకుని ప్రయోగ వేదికపైనున్న పీఎ్‌సఎల్వీ-సీ61 రాకెట్‌కు శాస్త్రవేత్తలు శుక్రవారం తుది పరీక్షలు నిర్వహించారు. ఇక, పీఎ్‌సఎల్వీ-సీ61 రాకెట్‌ నమూనాను ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌... శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరిని నారాయణన్‌ శాస్త్రవేత్తలతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. పీఎ్‌సఎల్వీ-సీ61 ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి పూజలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 04:31 AM