Share News

నువ్వసలు మనిషివేనా?.. సజ్జలపై కలిశెట్టి ఫైర్‌

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:29 AM

నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందే కాకుండా తమ మద్య విధానానికి ప్రజామోదం లభించిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం చూస్తూ...

నువ్వసలు మనిషివేనా?.. సజ్జలపై కలిశెట్టి ఫైర్‌

ఇంటర్నెట్ డెస్క్: నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందే కాకుండా తమ మద్య విధానానికి ప్రజామోదం లభించిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం చూస్తూ అసలు ఆయన మనిషేనా అన్న అనుమానం కలుగుతోందని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం స్కాంకు ఆధారాలు లేవనడం ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనమని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. 2019 వరకు డిస్టిలరీస్‌ లేని ఆదాన్‌ సంస్థకు వైసీపీ ప్రభుత్వం రూ.800 కోట్ల ఆర్డర్లు ఎలా ఇచ్చారని కలిశెట్టి ప్రశ్నించారు. మద్యం స్కామ్‌ జరగకపోతే ఆన్లైన్‌ లావాదేవీలను కాకుండా నగదు లావాదేవీలను ఎందుకు తప్పనిసరి చేశారని ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 04:29 AM