Share News

Ramprasad Reddy: అమరావతిలో 2500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా మైదానం

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:25 AM

రాజధాని అమరావతిలో 2500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఎం.రాంప్రసాదరెడ్డి తెలిపారు.

Ramprasad Reddy: అమరావతిలో 2500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా మైదానం

  • క్రీడల మంత్రి రాంప్రసాదరెడ్డి

సత్తెనపల్లి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో 2500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఎం.రాంప్రసాదరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఇండోర్‌ స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విజయవాడ, వైజాగ్‌, తిరుపతిలో స్పోర్ట్స్‌ అకాడమీల ఏర్పాటు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఉద్యోగాల్లో రెండు శాతం ఉన్న రిజర్వేషన్‌ను మూడు శాతానికి పెంచడంతో డీఎస్సీలో క్రీడాకారులకు 450 పోస్టులు లభించనున్నాయని తెలిపారు.

Updated Date - Jul 10 , 2025 | 05:25 AM