Share News

Board Reforms: ఏప్రిల్‌ 1 నుంచే ఇంటర్‌ తరగతులు

ABN , Publish Date - Feb 22 , 2025 | 04:11 AM

ప్రస్తుతం పబ్లిక్‌ పరీక్షలు ముగియగానే కాలేజీలకు వేసవి సెలవులు ఇచ్చి, తిరిగి జూన్‌ 1న తెరిచే విధానం అమలులో ఉంది. అయితే ప్రైవేటు కాలేజీలతో పోటీపడాలనే లక్ష్యంతో పరీక్షలు ముగియగానే తర్వాత విద్యా సంవత్సరాన్ని ప్రారంభించే విధానం తీసుకొచ్చింది.

Board Reforms: ఏప్రిల్‌ 1 నుంచే ఇంటర్‌ తరగతులు

మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్‌, గణితంలో బ్రిడ్జి కోర్సు ప్రారంభం

విద్యా సంవత్సరంలో సమూల మార్పులు

అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ విద్యా సంవత్సరంలో ఇంటర్‌ బోర్డు సమూల మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం పబ్లిక్‌ పరీక్షలు ముగియగానే కాలేజీలకు వేసవి సెలవులు ఇచ్చి, తిరిగి జూన్‌ 1న తెరిచే విధానం అమలులో ఉంది. అయితే ప్రైవేటు కాలేజీలతో పోటీపడాలనే లక్ష్యంతో పరీక్షలు ముగియగానే తర్వాత విద్యా సంవత్సరాన్ని ప్రారంభించే విధానం తీసుకొచ్చింది. ఇకపై మార్చి చివరి నాటికి పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్‌ 1నుంచి సెకండియర్‌ విద్యార్థులకు రెగ్యులర్‌ తరగతులు నిర్వహిస్తారు. వచ్చే 2025-26 విద్యా సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభించనున్నారు. ఫస్టియర్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 5 నుంచి అడ్మిషన్లు తీసుకుంటారు. ఫస్టియర్‌లో చేరిన వారికి ఇంగ్లిష్‌, గణితంపై బ్రిడ్జి కోర్సు ప్రారంభిస్తారు. ఏప్రిల్‌ 22 వరకు తరగతులు నిర్వహించి 23 నుంచి మే నెలాఖరు వరకు వేసవి సెలవులు ఇస్తారు. జూన్‌ 1నుంచి విద్యాసంవత్సరం తిరిగి కొనసాగుతుంది. దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పెరుగుతాయని బోర్డు భావిస్తోంది.


ఇవి కూడా చదవండి..

మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర ఎంతకు చేరిందంటే..

భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 22 , 2025 | 04:11 AM