Share News

Mine Test Success: మల్టీ ఇన్‌ఫ్లుయెన్స్‌ గ్రౌండ్‌ మైన్‌ పరీక్ష విజయవంతం

ABN , Publish Date - May 07 , 2025 | 05:00 AM

భారత్‌ విజయవంతంగా 'మల్టీ ఇన్‌ఫ్లుయెన్స్‌ గ్రౌండ్‌ మైన్‌' పరీక్షను పూర్తిచేసింది. డీఆర్‌డీవో సహకారంతో, స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖపట్నంలో ఈ పరీక్ష నిర్వహించబడింది

Mine Test Success: మల్టీ ఇన్‌ఫ్లుయెన్స్‌ గ్రౌండ్‌ మైన్‌ పరీక్ష విజయవంతం

విశాఖపట్నం, మే 6 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో సబ్‌మెరైన్లు, యుద్ధనౌకలను క్షణాల్లో పేల్చివేయడానికి ఉపయోగించే ‘మల్టీ ఇన్‌ఫ్లుయెన్స్‌ గ్రౌండ్‌ మైన్‌’ పరీక్షను భారత్‌ విజయవంతంగా పూర్తిచేసింది. డీఆర్‌డీవో సహకారంతో విశాఖపట్నంలోని నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లేబొరేటరీలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. విశాఖ తీరంలోని బంగాళాఖాతంలో దీనికి నిర్వహించిన పరీక్ష విజయవంతమైనట్టు నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి. దీనికి ప్రయోగాలన్నీ పూర్తయ్యాయని, త్వరలోనే నౌకాదళానికి అందుతుందని నేవీ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - May 07 , 2025 | 05:00 AM