Share News

Nellore District : పందెం పావురమా.. త్వరగా గమ్యం చేరుమా!

ABN , Publish Date - Feb 04 , 2025 | 05:25 AM

దాదాపు 800 పావురాలు పరుగు పందెంలో పాల్గొన్నట్లుగా వాయువేగంతో ఎగిరిపోయాయి.

Nellore District : పందెం పావురమా.. త్వరగా గమ్యం చేరుమా!

ABN AndhraJyothy : అది నెల్లూరు జిల్లా బోగోలు మండలం బిట్రగుంట రైల్వే ఫుట్‌బాల్‌ క్రీడామైదానం.. సోమవారం ఉదయం చిన్న లారీ వచ్చి ఆగింది. అందులోంచి దించిన 28 క్రేట్లను అలా తెరవగానే.. దాదాపు 800 పావురాలు పరుగు పందెంలో పాల్గొన్నట్లుగా వాయువేగంతో ఎగిరిపోయాయి. తమిళనాడులోని కన్యాకుమారి, తిరుత్తణి, తిరునల్వేళి ప్రాంతాలకు చెందిన పావురాల పెంపకందారులు వాటికి పందెం పెట్టుకున్నారట! తాము కాసిన పందెం ప్రకారం పావురాలు 1,550 కిలోమీటర్ల దూరంలోని కన్యాకుమారికి 7 గంటల్లో చేరుకోవాల్సి ఉంటుందని చెప్పా రు. ఇంత దూరం వెళ్లాలంటే రైలులో 18 గంటలు, బస్సులో అయితే 24 గంటలు పడుతుందని తెలిపారు.

-బిట్రగుంట, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 04 , 2025 | 05:26 AM