Share News

Home Minister Anita : దొంగలు బాగా తెలివిమీరారు

ABN , Publish Date - Feb 16 , 2025 | 04:53 AM

సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులను పట్టుకోవడానికి పోలీసు వ్యవస్థ అప్‌గ్రేడ్‌ అవ్వాలని..

Home Minister Anita : దొంగలు బాగా తెలివిమీరారు

  • టెక్నాలజీ సాయంతో నేరాలను నియంత్రించాలి

  • హోం మంత్రి వంగలపూడి అనిత

  • డిజిటల్‌ ఎవిడెన్స్‌ ప్రాముఖ్యతపై విజయవాడలో వర్క్‌షాపు

విజయవాడ లీగల్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): దొంగలు ఇప్పుడు బాగా తెలివిమీరిపోయారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులను పట్టుకోవడానికి పోలీసు వ్యవస్థ అప్‌గ్రేడ్‌ అవ్వాలని, టెక్నాలజీని ఉపయోగించుకొని నేరాలను నియంత్రించాలని సూచించారు. విజయవాడలోని జీఆర్‌టీ హోటల్‌లో శనివారం డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ ఆధ్వర్యంలో డిజిటల్‌ ఎవిడెన్స్‌ ప్రాముఖ్యతపై రాష్ట్రస్థాయి వర్క్‌షాపు జరిగింది. ఈ వర్క్‌షా్‌పకు ముఖ్య అతిథిగా మంత్రి అనిత విచ్చేశారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో మహిళలు ఎక్కువ మంది ఉండటం శుభపరిణామమన్నారు. పోలీసు, న్యాయవ్యవస్థల సమన్వయంతో చాలా కేసులు ఛేదించవచ్చన్నారు. ప్రసు ్తతం అన్ని కేసుల్లోనూ డిజిటల్‌ ఎవిడెన్స్‌ ఉంటోందని విజయవాడ పోలీసు కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు చెప్పారు. అయితే డిజిటల్‌ ఎవిడెన్స్‌ను ఎలా సేకరించాలి అనే దానిపై సిబ్బందికి శిక్షణ అవసరమన్నారు. అనంతరం హోం మంత్రి అనితను ఏపీపీలు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ బైరా రామకోటేశ్వరరావు, జాయింట్‌ డైరెక్టర్లు, పలుప్రాంతాల నుంచి వచ్చిన ఏపీపీలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో హోం మంత్రి అనిత మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తప్పు చేసినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆయన అరెస్టు కక్షసాధింపు చర్య కాదని స్పష్టం చేశారు.

Updated Date - Feb 16 , 2025 | 04:54 AM