Hindalco: ఐఫోన్ చాసిస్.. మేడిన్ కుప్పం
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:30 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పం ముఖచిత్రం మారుతోంది. ఇకపై ఐఫోన్ల తయారీలోనూ కుప్పం ముద్రపడనుంది. ..
ముడి సరుకు తయారీ ప్లాంట్‌కు ఎస్‌ఐపీబీ ఓకే
రూ. 586 కోట్లతో హిందాల్కో యూనిట్
ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పం ముఖచిత్రం మారుతోంది. ఇకపై ఐఫోన్ల తయారీలోనూ కుప్పం ముద్రపడనుంది. ఇక్కడ యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ చాసిస్ తయారీకి వినియోగించే ముడిపదార్థం ప్లాంట్ రాబోతోంది. ఇందుకోసం రూ. 586 కోట్లతో సమీకృత అల్యూమినియం యూనిట్‌ను ప్రఖ్యాత కంపెనీ హిందాల్కో స్థాపించబోతోంది. ఈ సంస్థ ప్రతిపాదనలకు గురువారం ఎస్‌ఐపీబీ ఆమోద ముద్ర వేసింది. ఈయూనిట్‌తో 613 మందికి ఉపాధి లభించనుంది. హిందాల్కో ప్లాంట్‌లో 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టుకు ఏపీ ఎలకా్ట్రనిక్స్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 2025-30 కింద ఆమోదం తెలిపారు. ఇప్పటికే బెంగళూరులో ఐఫోన్ తయారీ యూనిట్ ప్రారంభమైంది. ఇక్కడకి సమీపంలోని కుప్పంలో ఈ ప్లాంట్ రాబోతుండడం ప్రాముఖ్యం సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..