Share News

High Court: కృష్ణంరాజు వీడియో కోర్టుకు ఇవ్వండి

ABN , Publish Date - Jun 26 , 2025 | 06:15 AM

రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన నీచ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తమ ముందు ఉంచాలని ప్రాసిక్యూషన్‌ను హైకోర్టు ఆదేశించింది.

High Court: కృష్ణంరాజు వీడియో కోర్టుకు ఇవ్వండి

  • ప్రాసిక్యూషన్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన నీచ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తమ ముందు ఉంచాలని ప్రాసిక్యూషన్‌ను హైకోర్టు ఆదేశించింది. కృష్ణంరాజు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై. లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. సాక్షి చానల్‌ డిబేట్‌లో కృష్ణంరాజు నీచ వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్‌ కోరుతూ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణ జరిగింది.

Updated Date - Jun 26 , 2025 | 08:08 AM