Share News

Posani Krishna Murali: పోసానికి నోటీసులిచ్చి వివరణ తీసుకోండి

ABN , Publish Date - Mar 08 , 2025 | 05:23 AM

విజయవాడ, సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ పోసాని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) సాయిరోహిత్‌ స్పందిస్తూ.. ఈ కేసులో పీటీ వారెంట్‌ అమలుకాలేదని వివరించారు.

Posani Krishna Murali: పోసానికి నోటీసులిచ్చి వివరణ తీసుకోండి

విజయవాడ పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): సినీనటుడు పోసాని కృష్ణమురళి విషయంలో బీఎన్‌ఎ్‌సఎస్‌ సెక్షన్‌ 35(3)కు అనుగుణంగా నడుచుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విజయవాడ, సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ పోసాని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) సాయిరోహిత్‌ స్పందిస్తూ.. ఈ కేసులో పీటీ వారెంట్‌ అమలుకాలేదని వివరించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ పిటిషనర్‌ విషయంలో బీఎన్‌ఎ్‌సఎస్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఓ టీవీ చానల్‌, ఆ సంస్థ యజమాని, అందులోని ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అసభ్యకర పదజాలంతో దూషించానంటూ విజయవాడకు చెందిన పావులూరి రమేశ్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సూర్యారావుపేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ పోసాని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..

Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ

Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..

Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2025 | 05:23 AM