Andhra Pradesh weather: గాలివాన బీభత్సం
ABN , Publish Date - May 17 , 2025 | 03:44 AM
దక్షిణ కోస్తా జిల్లాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షాల కారణంగా విద్యుత్తు ఫీడర్లు దెబ్బతినడంతో అనేక ప్రాంతాల్లో కరెంట్ అంతరాయం ఏర్పడింది.
విద్యుత్తు రంగం విలవిల.. సీపీడీసీఎల్‌పై తీవ్ర ప్రభావం
గుంటూరు, బాపట్లలో నేలకొరిగిన చెట్లు, స్తంభాలు
గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేత
యుద్ధ ప్రాతిపదికన కరెంటు పునరుద్ధరణ
బర్లీ పొగాకు తడిసి రైతుల ఆందోళన
అమరావతి, గుంటూరు, బాపట్ల, మే 16 (ఆంధ్రజ్యోతి): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు దక్షిణకోస్తా జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా కుండపోత వాన, కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగం గా కరెంటు నిలిపివేసినా, అనేక చోట్ల విద్యుత్తు తీగలు తెగిపడడం, ఫీడర్లు దెబ్బతిని విద్యుత్తుకు అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈపీడీసీఎల్ పరిధిలోని అనకాపల్లి, పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి ప్రాంతాల్లో పాక్షికంగా విద్యుత్తుఫీడర్లు దెబ్బతిన్నాయి. ఇక సీపీడీసీఎల్ పరిధిలోని బాపట్ల, సీఆర్‌డీఏ, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో చెట్లు విరిగిపడి విద్యుత్తు తీగలు తెగిపోయాయి. సీపీడీసీఎల్ పరిధిలో 33 కేవీ ఫీడర్లు 37, 11 కేవీ ఫీడర్లు 493 ఫెయిలయ్యాయి. వాటిలో 33 కేవీ ఫీడర్లు 35, 11 కేవీ ఫీడర్లు 470 పునరుద్ధరించారు. తెగిపడిన వైర్లను సరిచేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. జరిగిన నష్టంపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక వస్తుందని ఇంధనశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News