Share News

Tirupati Temple Rush: తిరుమలకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - May 30 , 2025 | 04:45 AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది, సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.వేసవి సెలవుల చివర రోజుల్లో భక్తులు భారీగా తరలివచ్చారు.

Tirupati Temple Rush: తిరుమలకు పోటెత్తిన భక్తులు

  • సర్వ దర్శనానికి 16 గంటల సమయం

తిరుమల, మే 29(ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో గురువారం నుంచే కొండపై రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ ఒకటిన్నర కిలోమీటరు దూరం కృష్ణతేజ విశ్రాంతి గృహం మీదుగా శిలాతోరణం వరకు వ్యాపించింది. ఈ క్యూలో ఉన్న భక్తులకు స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఇక, టైంస్లాట్‌ టోకెన్‌, ఇతర దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం తర్వాత దర్శనం లభిస్తోంది. ఆలయ పరిసరాలు, మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం, బస్టాండ్‌, గదులు కేటాయించే సీఆర్వో, ఎంబీసీ వంటి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Updated Date - May 30 , 2025 | 04:46 AM