Share News

Temperature : ఠారెత్తించిన ఎండ

ABN , Publish Date - Feb 17 , 2025 | 04:06 AM

రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండతీవ్రతతో వాతావరణం వేడెక్కింది.

Temperature : ఠారెత్తించిన ఎండ

  • కర్నూలులో 38.2 డిగ్రీలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): మధ్యభారతం మీదుగా వీచిన పొడిగాలులతో రాష్ట్రంలో ఆదివారం ఎండ ఠారెత్తించింది. రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండతీవ్రతతో వాతావరణం వేడెక్కింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా కర్నూలులో 38.2 డిగ్రీలు నమోదైంది. కోస్తాలో పలుప్రాంతాల్లో ఉదయంపూట పొగమంచు కురిసింది. శివారు ప్రాంతాలు, ఏజెన్సీలో రాత్రిపూట చలి తీవ్రత కొనసాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతలంలో తొమ్మిది డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా పొగమంచు కురుస్తుందని, కోస్తా, రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..

Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..

Updated Date - Feb 17 , 2025 | 04:06 AM