Share News

Health Commissioner : లింగ నిర్ధారణ నివారణ కమిటీ పునర్నియామకం

ABN , Publish Date - Jan 31 , 2025 | 05:49 AM

ఆరోగ్యశాఖ కమిషనర్‌ పంపిన ప్రతిపాదన ప్రకారం సలహాదారుల కమిటీని పునర్నియమించారు.

Health Commissioner : లింగ నిర్ధారణ నివారణ కమిటీ పునర్నియామకం

అమరావతి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షల నివారణకు ప్రభుత్వం నియమించిన రాష్టస్థాయి సలహాదారుల కమిటీలో కొత్త వారిని ప్రభుత్వం నియమించింది. ఆరోగ్యశాఖ కమిషనర్‌ పంపిన ప్రతిపాదన ప్రకారం సలహాదారుల కమిటీని పునర్నియమించారు. కమిటీలో ఆరోగ్యశాఖ కమిషనర్‌ చైర్మన్‌గా ఉంటారు. న్యాయ శాఖ నుంచి జాయింట్‌ సెక్రటరీ, ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, కర్నూలు మెడికల్‌ కాలేజీ గైనిక్‌ ప్రొఫెసర్లతో పాటు స్వచ్ఛంద సంస్థలకు చెందిన మాధవీ గణపతి, జి.కవిత, సి.భానుజను మెంబర్లుగా నియమించారు. ఈ కమిటీకి ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్‌ మెంబర్‌ సెక్రటరీగా ఉంటారు. ఆరోగ్యశాఖ కమిషనర్‌ వెంటనే కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం.టి.కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jan 31 , 2025 | 05:49 AM