AP Police: పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హజరత్తయ్య
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:16 AM
ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ సీఐ చావా హజరత్తయ్య..
ఉపాధ్యక్షుడిగా తిరుపతిస్వామి
ఒంగోలు క్రైం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ సీఐ చావా హజరత్తయ్య ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఇదే జిల్లాలోని ఏఆర్ ఎస్సై వి.తిరుపతి స్వామి ఎన్నికయ్యారు. ఒంగోలులోని కేబీ రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాలులో సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అలాగే ఐదుగురు సభ్యులను కోఆప్షన్ మెంబర్లుగా ఎన్నుకున్నారు.