Gorantal Madhav: పోలీసుల అదుపులో గోరంట్ల మాధవ్
ABN , Publish Date - Apr 10 , 2025 | 06:38 PM
Gorantal Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు మహానగరంలోని నగరం పాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

గుంటూరు, ఏప్రిల్ 10: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీపై వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్‌పై దాడికి యత్నించిన ఆ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చేబ్రోలు కిరణ్‌ను పోలీస్ గురువారం అరెస్ట్ చేశారు.
అనంతరం అతడిని వాహనంలో గుంటూరు తరలించే క్రమంలో గోరంట్ల మాధవ్ అడ్డుకున్నారు. ఆ క్రమంలో అతడిపై గోరంట్ల మాధవ్ దాడికి యత్నించారు. అయితే మాధవ్ ప్రయత్నాన్ని గుంటూరు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్‌లో మాధవ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడిని పీఎస్‌కు తరలించారు.
మరోవైపు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీపై టీడీపీకి చెందిన చేబ్రోలు కిరణ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో టీడీపీ అధిష్టానం వెంటనే స్పందించింది. చేబ్రోలు కిరణ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అక్కడితో ఆగకుండా అతడిని వెంటన అరెస్ట్ చేయాలంటూ గుంటూరు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని గుంటూరు తరలిస్తుండగా.. ఈ విషయం తెలుసుకున్న గోరంట్ల మాధవ్ వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ క్రమంలో చేబ్రోలు కిరణ్‌పై దాడి చేసేందుకు ఉద్యక్తుడయ్యారు. దీంతో చేబ్రోలు కిరణ్‌ను తీసుకు వెళ్తున్న వాహనాన్ని అడ్డుకొని... అతడిపై దాడికి యత్నించడంతో.. గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
For AndhraPradesh News And Telugu News