AP NEWS: పల్నాడు జిల్లాలో దారుణం.. ఇద్దరు టీడీపీ వర్గీయుల హత్య
ABN , Publish Date - May 24 , 2025 | 06:20 PM
Palnadu District News: పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో శనివారం డబుల్ మర్డర్ జరిగింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం వర్గీయులు హత్యకు గురయ్యారు.
పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో (Macherla Constituency) ఇవాళ(శనివారం) జంట హత్యలు కలకలం రేపాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) వర్గీయులు దారుణ హత్యకు గురయ్యారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని కారుతో ప్రత్యర్థులు ఢీకొట్టారు. కిందపడిన ఇద్దరిని గొడ్డళ్లతో ప్రత్యర్థులు నరికి చంపారు. మృతులు గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులుగా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. రాజకీయ కక్షలే ఈ హత్యలకు దారితీసినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గత జగన్ ప్రభుత్వంలో తోట చంద్రయ్యను వైసీపీ నేతలు (YSRCP Leaders) నరికి చంపిన విషయం తెలిసిందే. తాజాగా అదే గుండ్లపాడుకు చెందిన ఇద్దరు టీడీపీ వర్గీయులు హత్యకు గురయ్యారు. ఈ విషయం తెలియడంతో జిల్లా ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ఈ దారుణ ఘటన మాచర్ల నియోజకవర్గంతో పాటు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా నేతలు టీడీపీ హై కమాండ్‌కు తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. హత్యకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఘటన జరిగిన స్థలానికి దగ్గరలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇలాంటి ఘోరమైన ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
NITI Aayog Meeting: స్వర్ణాంధ్రపై చంద్రబాబు ప్రజెంటేషన్.. నీతి ఆయోగ్‌లో ప్రశంసల వర్షం
Tirumala: చంద్రబాబు వచ్చిన తర్వాత తిరుమలలో గత 11 నెలల్లో అనేక మార్పులు..
Read latest AP News And Telugu News