Mark Shankar: మార్క్ శంకర్‌పై అసభ్యకర పోస్టులు.. ఒకరు అరెస్ట్
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:22 PM
Mark Shankar: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ లక్ష్యంగా సోషల్ మీడియలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని గుంటూరు జిల్లా పోలీసులు గుర్తించారు. అతడు కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు.

గుంటూరు,ఏప్రిల్ 16: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి.. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. బుధవారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మార్క్ శంకర్ లక్ష్యంగా పెట్టిన పోస్ట్‌లపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించామన్నారు. అందులోభాగంగా దర్యాప్తు చేపట్టామని... దీంతో ఈ పోస్టులు పెట్టిన వ్యక్తి..కర్నూలు జిల్లాకు చెందిన పొట్టపాశం రఘు అలియాస్ పుష్పరాజ్‌గా గుర్తించామని చెప్పారు.
అనంతరం అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సోషల్ మీడియా వార్‌లో భాగంగా అతడు ఈ పోస్ట్ చేశారని పేర్కొన్నారు. అల్లు అర్జున్‌కు మద్దతుగా మెగా కుటుంబంపై రఘు అలియాస్ పుష్పరాజ్ ద్వేషం పెంచుకున్నాడని తెలిపారు. గతంలో మహిళలపై సైతం ఇతడు అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టాడని గుర్తు చేశారు. సింగపూర్‌లోని ఓ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంపై సమాచారం తెలియగానే.. పవన్ కల్యాణ్‌తోపాటు ఆయన సోదరుడు చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు. అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందిన మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుట పడినట్లు తెలుస్తోంది. మరోవైపు కుమారుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడడంతో.. మార్క్ శంకర్ తల్లి అన్నా.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించుకొన్నారు. అలాగే వెంగమాంబ సన్నిధిలో ఒక పూట భోజనానికి విరాళం సైతం అందజేశారు. అలాంటి వేళ.. మార్క్ శంకర్ గాయపడడంతో.. అతడినే లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేశారు.
For AndhraPradesh News And Telugu News