Chandrababu Naidu: ఢిల్లీలో సీఎం చంద్రబాబును సన్మానించిన ఎంపీలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 09:19 PM
సీఎం చంద్రబాబు నాయుడును టీడీపీ ఎంపీలు ఘనంగా సన్మానించారు. సీఎం చంద్రబాబుకు బొబ్బిలి వీణను విజయనగరం ఎంపీ కె. అప్పలనాయుడు బహుకరించారు.
అమరావతి, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఎకనామిక్ టైమ్స్ సంస్థ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారానికి ఆయనను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో గురువారం న్యూఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడును టీడీపీ ఎంపీలు ఘనంగా సన్మానించారు. సీఎం చంద్రబాబుకు బొబ్బిలి వీణను విజయనగరం ఎంపీ కె. అప్పలనాయుడు బహుకరించారు. సీఎం చంద్రబాబును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శాలువాతో సత్కరించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వ శైలి ఎందరికో స్ఫూర్తినిస్తుందని ఎంపీలు ప్రశంసించారు.
రాష్ట్రంలో రాష్ట్రాభివృద్ధితోపాటు పారిశ్రామికవృద్ధికి ఇంకా చాలా చేయాల్సి ఉందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మరో వైపు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు జన్మదినం ఈ రోజు. సీఎం సన్మాన కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఉభయ సభల్లోని టీడీపీ ఎంపీలంతా పాల్గొన్నారు.
మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ఎంపీలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ని ఎంపీలంతా సన్మానించారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశమయ్యారు.

శుక్రవారం సైతం న్యూఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడపనున్నారు. ఏపీకి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి అవసరమైన కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అనుమతులతోపాటు ఆమోదం తెలిపే అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటితో అంటే.. డిసెంబర్ 19వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్ జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్
విద్యార్థుల మృతి కేసులో నకిలీ పోలీసుల విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు
For More AP News And Telugu News