Share News

Covid Guidelines: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్

ABN , Publish Date - May 22 , 2025 | 08:53 PM

Covid Guidelines: కరోనా మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.

Covid Guidelines: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్
Covid Guidelines

విజయవాడ: కరోనా మార్గదర్శకాలను (Covid Guidelines) ఇవాళ(మే22)న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ప్రార్ధన సమావేశాలు, సామాజిక సమావేశాలు పార్టీలు, ఇతర కార్యక్రమాల వంటివి వాయిదా వేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. రైల్వే‌స్టేషన్లు , బస్టాండ్లు విమానాశ్రయాలు వంటి వాటిలో కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.


ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని తెలిపింది. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారడం లేదా ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించింది. అన్ని పరీక్ష సౌకర్యాలతో కూడిన 24 గంటలు పని చేసే ల్యాబ్‌లలో మాస్క్‌లు, పీపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలని అధికారులకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

Pawan Kalyan: ఇది మనందరి బాధ్యత.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Tirumala: తిరుమలలో ఓ వ్యక్తి బహిరంగంగా చేసిన పని చూస్తే

ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ

AP Ration Card: రేషన్‌కార్డులపై ఆందోళన వద్దు.. ఇది నిరంతర ప్రక్రియ

Read latest AP News And Telugu News

Updated Date - May 22 , 2025 | 09:02 PM