Huge Laddu For Ganesha: అమ్మో.. ఎంత పెద్ద లడ్డో..!
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:46 PM
తెనాలిలో ఓ స్వీట్ షాపు నిర్వాహకులు వినాయక చవితి సందర్భంగా భారీ లడ్డూను తయారు చేశారు. సుల్తానాబాద్‌లోని మిర్చి స్నాక్స్ నిర్వాహకులు 2 టన్నుల ( 2వేల కిలోలు) బరువుతో శివలింగాకృతిలో భారీ లడ్డూని రూపొందించారు.
గుంటూరు: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భక్తులు వివిధ రకాలుగా తమ భక్తిని ప్రదర్శిస్తూ.. ఉంటారు. కోరిన కోరికలు తీర్చాలని వినాయకుడికి ప్రసాదాలతో.. వివిధ రకాల మొక్కులతో వేడుకుంటారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం గాజువాక లంక గ్రౌండ్స్‌లో లక్ష చీరలతో ఏర్పాటు చేసిన సుందర వస్త్ర మహా గణపతికి నైవేద్యంగా 2 వేల కిలోలు భారీ లడ్డూను నిర్వాహకులు తయారు చేయించి వారి భక్తిని చాటుకున్నారు. 2 టన్నుల లడ్డూ చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. తెనాలిలో ఓ స్వీట్ షాపు నిర్వాహకులు వినాయక చవితి సందర్భంగా భారీ లడ్డూను తయారు చేశారు. సుల్తానాబాద్‌లోని మిర్చి స్నాక్స్ నిర్వాహకులు 2 టన్నుల( 2వేల కిలోలు) బరువుతో శివలింగాకృతిలో భారీ లడ్డూని రూపొందించారు. గాజువాక లంక గ్రౌండ్స్‌లో లక్ష చీరలతో ఏర్పాటు చేసిన సుందర వస్త్ర మహా గణపతికి నైవేద్యంగా ఈ లడ్డూను సిద్ధం చేయించినట్లు తయారీదారులు ఉప్పల కిషోర్ తెలిపారు. తమ ఖార్ఖానాలోని 15 మంది సిబ్బంది నాలుగు రోజుల పాటు శ్రమించి, 8 అడుగుల ఎత్తు, 2 వేల కిలోల బరువు గల శివలింగం లడ్డూని తయారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇది దేశంలోనే అత్యంత భారీ లడ్డూ అని, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కూడా లభించే అవకాశం ఉందన్నారు. తాము గతంలో కూడా విభిన్న ఆకృతులలో లడ్డూలు, మహా ప్రసాదాలను తయారు చేసినట్లు తెలియజేశారు. కాగా భారీ లడ్డూను తిలకించేందుకు పరిసర ప్రాంత ప్రజలు తరలివస్తున్నారు. ప్రత్యేక వాహనంలో గాజువాకకు ఈ భారీ లడ్డూను తరలించినట్లు ఆయన స్పష్టం చేశారు.
వి కూడా చదవండి:
ఉసిరితోనూ సైడ్ ఎఫెక్ట్స్.. వీటిని ఎవరు తినకూడదంటే..
బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..