Share News

Guntur : ఏసీ బోగీల్లో విలువైన వస్తువుల చోరీలు

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:28 AM

ఉద్యోగం చేస్తూ ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో విలువైన వస్తువులను దొంగిలిస్తున్న వ్యక్తిని గుంటూరు రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Guntur : ఏసీ బోగీల్లో విలువైన వస్తువుల చోరీలు

  • అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి చేతివాటం

నరసాపురం, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఏసీ బోగీలో బెడ్‌ రోలర్‌గా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం చేస్తూ ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో విలువైన వస్తువులను దొంగిలిస్తున్న వ్యక్తిని గుంటూరు రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన నాగూర్‌ వలి తన భార్య షహనాజ్‌ బేగం, ఇద్దరు పిల్లలతో కలిసి శుక్రవారం రాత్రి లింగంపల్లి నుంచి నరసాపురం ఎక్స్‌ప్రె్‌సలో సెకండ్‌ క్లాస్‌ బోగీలో ప్రయాణిస్తున్నారు. బేగం కింది బెర్త్‌లో ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి నిద్ర పోయారు. ఈ క్రమంలో వివేక్‌ ఆమె ఫోన్‌ దొంగిలించాడు. బేగం మేల్కొని కేకలు వేయడంతో నిందితుడు పరుగుతీశాడు. బాధితురాలు, ఆమె భర్త అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. నాగూర్‌ వలి మిగిలిన సిబ్బందిని నిలదీయడంతో వారు దొంగను పట్టుకున్నారు. బాధితులు గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేసిన పోలీసులకు 15కు పైగా సెల్‌ఫోన్లు లభించాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..

Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..

Updated Date - Feb 09 , 2025 | 04:28 AM