SERP Employees : సెర్ప్ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Jan 08 , 2025 | 04:57 AM
వైసీపీ హయాంలో సమ్మె చేపట్టిన సెర్ప్ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
‘ఆంధ్రజ్యోతి’ వార్తకు స్పందించిన సెర్ప్ సీఈఓ
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో సమ్మె చేపట్టిన సెర్ప్ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. గత సర్కార్ హయాంలో సమ్మె చేసినందుకు సెర్ప్ సిబ్బందికి 9 రోజుల జీతం కట్ చేశారు. దీంతో పాటు గత ఏడాది జనవరి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్‌లు పెండింగ్‌లో పెట్టారు. మంగళవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘‘సెర్ప్ సిబ్బందికి ‘ఇంక్రిమెంట్’ ఇక్కట్లు’’ అనే శీర్షికతో వచ్చిన వార్తకు సెర్ప్ సీఈఓ వీరపాండ్యన్ స్పందించారు. ఎఫ్‌టీఈలు 2,759 మందికి, అనుబంధ సిబ్బందికి జనవరిలో ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లను మంజూరు చేస్తూ సెర్ప్ సీఈఓ ఆదేశాలిచ్చారు. అయితే సమ్మె చేపట్టిన రోజులకు మాత్రం వేతనాలు అందించేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్లు మంజూరు చేసినందుకు సెర్ప్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.