Share News

Grand Launch of Stri Shakti: అట్టహాసంగా స్త్రీ శక్తి

ABN , Publish Date - Aug 16 , 2025 | 04:45 AM

రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పండుగ వాతావరణంలో ఆర్టీసీ బస్సులకు జెండా ఊపి ఆరంభించారు. మహిళలకు స్వయంగా ఉచిత టికెట్లు అందజేశారు. ...

Grand Launch of Stri Shakti: అట్టహాసంగా స్త్రీ శక్తి

  • రాష్ట్రవ్యాప్తంగా సందడిగా కార్యక్రమాలు

  • ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పండుగ వాతావరణంలో ఆర్టీసీ బస్సులకు జెండా ఊపి ఆరంభించారు. మహిళలకు స్వయంగా ఉచిత టికెట్లు అందజేశారు. మహిళలతో పాటు బస్సులలో ప్రయాణించారు. స్త్రీ శక్తి పథకాన్ని అనంతపురం ఆర్టీసీ బస్టాండులో మంత్రి పయ్యావుల కేశవ్‌, హిందూపురం ఆర్టీసీ బస్టాండులో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రప్రారంభించారు. నెల్లూరు నగరంలోని ప్రధాన బస్టాండులో మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. కందుకూరులో స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, కావలిలో ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డిపాళెంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరులో మంత్రి కొలుసు పార్థసారథి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఏలూరు నుంచి వేగివాడ వరకు 25 కిలోమీటర్లు బస్సును స్వయంగా నడిపారు. ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు కూడా ఆర్టీసీ బస్సును నడిపారు. టి.నర్సాపురం మండలంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌లు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలగ్రామంలో జరిగిన కార్యక్రమంలో నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అనకాపల్లి ఆర్టీసీ డిపో వద్ద హోం మంత్రి వంగలపూడి అనిత ఈ పథకాన్ని ప్రారంభించి, బస్సులో ప్రయాణించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్‌ విశాఖపట్నంలోని మద్దిలపాలెం డిపోలో ఈ పథకాన్ని ప్రారంభించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మధురవాడ బస్సు డిపోలో, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గోపాలపట్నంలో, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు పెందుర్తి బస్టాండ్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. రాయచోటి బస్టాండు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. కడప నూతన ఆర్టీసీగ్యారేజీలో మంత్రి ఎండీ ఫరూక్‌, ఎమ్మెల్యే మాధవి జెండా ఊపి ప్రారంభించారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్‌, నంద్యాలలో బీసీ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం మండలం సింగుపురంలో మంత్రి అచ్చెన్నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించి, జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు బస్సులో ప్రయాణించారు. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని ఆర్టీసీ బస్టాండులో జరిగిన కార్యక్రమంలో మంత్రి సవిత, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పాల్గొన్నారు.

DZFB.jpgFBGX.jpgDVSFF.jpgFZ.jpg

Updated Date - Aug 16 , 2025 | 04:45 AM