Share News

Thota Chandrayya Son: తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వోద్యోగం

ABN , Publish Date - Jul 10 , 2025 | 03:24 AM

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేత దివంగత తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు జూనియర్‌ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Thota Chandrayya Son: తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వోద్యోగం

  • జూ.అసిస్టెంట్‌గా నియామకానికి మంత్రి మండలి ఆమోదం

మాచర్ల టౌన్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేత దివంగత తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు జూనియర్‌ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం జరిగిన సమావేశంలో క్యాబినెట్‌ ఆమోదించింది. జనవరి 13, 2022లో రాజకీయ కారణాలతో ప్రత్యర్థుల చేతిలో చంద్రయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. చంద్రయ్య బీసీ-బీ, పెరిక సామాజిక వర్గానికి చెందిన వారని, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్న వారి కుటుంబ ఆదాయం రూ.80 వేలు లోపేనని, కొంత మెట్టు భూమి మాత్రం ఉందని కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పేద కుటుంబం కావడంతో చంద్రయ్య కుమారునికి ఉద్యోగం, భార్యకు ఆర్థికసాయం చేసేందుకు గురజాల ఆర్డీవో, వెల్దుర్తి తహసీల్దారు సిఫారసు చేశారు. ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపి, పల్నాడు జిల్లా కలెక్టర్‌కు తగిన ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Jul 10 , 2025 | 03:24 AM