Share News

Electricity Services: విద్యుత్తు సేవలపై ప్రజల్లో సంతృప్తి పెరగాలి

ABN , Publish Date - May 27 , 2025 | 06:07 AM

విద్యుత్ సేవలపై ప్రజల సంతృప్తిని పెంచాలని ముఖ్య కార్యదర్శి కే విజయానంద్‌ సూచించారు. సమస్యలు రియల్ టైంలో పరిష్కరించి, ఆలస్యం చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా హెచ్చరించారు.

Electricity Services: విద్యుత్తు సేవలపై ప్రజల్లో సంతృప్తి పెరగాలి

డిస్కమ్‌ల సీఎండీలతో సమీక్షలో సీఎస్‌

అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ అన్నారు. సమస్యలను పరిష్కరించడంలో చరుకుగా వ్యవహరించడం లేదన్న ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ(ఆర్టీజీస్‌) కార్యాలయంలో డిస్కమ్‌ల సీఎండీలతో వర్చువల్‌ రివ్యూ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ‘రియల్‌ టైమ్‌లో సమస్యలు పరిష్కారమవ్వాలి. విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఎదురుగాకుండా చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్య, పట్టణ ప్రాంతాల్లో కరెంటు కోతలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు లేకుండా చూడాలి. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించాలి. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు. విద్యుత్తు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరంతరం సేవలందించాలి’ అని సీఎస్‌ స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఈపీడీసీఎల్‌ సీఎండీ పృధ్వీతేజ్‌, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు, సీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్

మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

For National News And Telugu News

Updated Date - May 27 , 2025 | 06:07 AM