Share News

Mining Fees: జీఓ 57 ప్రకారమే సీనరేజీ ఫీజులు: గనుల శాఖ

ABN , Publish Date - May 17 , 2025 | 04:02 AM

గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ జారీ చేసిన జీఓ 75 ప్రకారం, అదనపు కాలపరిమితి పొందిన సీనరేజీ కాంట్రాక్టర్లు జీఓ 57కి అనుగుణంగా ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. కొత్త ఫీజు సవరింపులపై ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది.

Mining Fees: జీఓ 57 ప్రకారమే సీనరేజీ ఫీజులు: గనుల శాఖ

అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): అదనపు కాలపరిమితి పొందిన సీనరేజీ కలెక్షన్‌ కాంట్రాక్టర్‌లు జీఓ 57ను అనుసరించి ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు(జీఓ 75) జారీ చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కరోనా కాలంలో మైన్స్‌పై విధించిన కన్సిడరేషన్‌ అమౌంట్‌ను ఇటీవల ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో సవరించిన ఫీజులు, వసూలు చేయాల్సిన ఫీజులను జీఓ 57 నిర్దేశిస్తుంది. దానిప్రకారమే కాంట్రాక్టర్లు సీనరేజీ వసూలు చేయాలని గనుల శాఖ ఆదేశించింది. అలాగే, పలు రకాల ఫీజులను సవరించిన నేపథ్యంలో ఆ ఫీజుల ఫున:సమీక్ష, సర్దుబాటుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇదిలా ఉండగా, జాతీయ రహదారివర్క్‌లు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనులకు సంబంధించిన ఫీజుల విషయంలో అమల్లో ఉన్న నిబంధనలు(జీఓ 57) పాటించాలని కాంట్రాక్ట్‌ సంస్థలకు గనుల శాఖ స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 04:03 AM