Share News

Women Empowerment: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం: మంత్రి సవిత

ABN , Publish Date - Mar 10 , 2025 | 02:06 AM

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళా సదస్సు నిర్వహించారు. మహిళల అభ్యున్నతికి ఆనాడు ఎన్టీఆర్‌ తరహాలోనే నేడు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని సవిత తెలిపారు.

Women Empowerment: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం: మంత్రి సవిత

బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షురాలిగా జయశ్రీ

మహిళా విభాగం అధ్యక్షురాలిగా సరళాదేవి ప్రమాణం

మంగళగిరి సిటీ, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థికాభివృద్ధితోనే సమాజ ప్రగతి సాధ్యమని భావించిన కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళా సదస్సు నిర్వహించారు. మహిళల అభ్యున్నతికి ఆనాడు ఎన్టీఆర్‌ తరహాలోనే నేడు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని సవిత తెలిపారు. మహిళలకు వెన్నుదన్నుగా నిలుస్తూ విద్య, ఉద్యోగ అవకాశాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలిగా జయశ్రీ, మహిళా విభాగం అధ్యక్షురాలిగా వావిలాల సరళాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గురుకులాల కార్యదర్శి మాధవీలత పాల్గొన్నారు.


Read more :

Also Read: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు
Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?

Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 02:06 AM