Women's Day: మహిళా దినోత్సవాన అతివలకు కూటమి కానుకలు
ABN , Publish Date - Mar 08 , 2025 | 04:42 AM
మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో సెర్ప్, మెప్మాల ద్వారా ఎంఎ్‌సఎంఈ విభాగంలో వారికి చేయూతను అందించనుంది. తద్వారా లక్ష మందికిపైగా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దనున్నారు.
అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపు..
కార్యకర్తలకు 1.79 లక్షల నుంచి 2.32 లక్షలు
హెల్పర్లకు 1.09 లక్షల నుంచి 1.41 లక్షలకు
లక్ష మంది మహిళలకు పారిశ్రామిక ‘సాయం’
నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అతివలకు పలు కానుకలు ప్రకటించనుంది. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో సెర్ప్, మెప్మాల ద్వారా ఎంఎ్‌సఎంఈ విభాగంలో వారికి చేయూతను అందించనుంది. తద్వారా లక్ష మందికిపైగా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దనున్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల చిరకాల డిమాండ్ అయిన గ్రాట్యుటీ పెంపుపైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు ఇచ్చిన గ్రాట్యుటీ పెంపు హామీని మహిళా దినోత్సవం సందర్భంగా నెరవేర్చనుంది ప్రభుత్వ నిర్ణయం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు రూ.1.79 లక్షల నుంచి రూ.2.32 లక్షలు వరకు వారి సర్వీసు ఆధారంగా అందనుంది. అదేవిధంగా అంగన్వాడీ ఆయాలకు రూ.1.09 లక్షల నుంచి 1.41 లక్షల వరకు గ్రాట్యుటీ అందిస్తారు. దీనిని అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.17.73 కోట్ల భారంపడనుంది. అంగన్వాడీల గ్రాట్యుటీ పెంపుపై శనివారం మార్కాపురంలో ప్రభుత్వం నిర్వహించనున్న మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నారు.
లక్ష మందికిపైగా లబ్ధి
రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 1,04,516 మంది అంగన్వాడీ కార్యకర్తలు(55,607), ఆయాలు(48,909) పనిచేస్తున్నారు. వీరిలో ఏటా రిటైర్ అయ్యే వారికి లేదా రాజీనామా చేసేవారికి చెల్లించే గ్రాట్యుటీ రూ.17,73,43,218 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 2025-26 బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించింది. ప్రతి సంవత్సరం 1,218 మందికి పైగా కార్యకర్తలు, ఆయాలు పదవీ విరమణ పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు.
కార్యకర్తలకు ఇలా..
గ్రాట్యుటీ అమలు విషయంలో ఉద్యోగి ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉంటే అన్ని సంవత్సరాలు సంవత్సరానికి 15 రోజుల వేతనం చొప్పున లెక్కిస్తారు. అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లను ఉద్యోగంలోకి తీసుకోవడానికి గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లు. అంటే గరిష్ఠ వయసు నుంచి పదవీ విరమణ వయసు వరకు 27 సంవత్సరాలు అంగన్వాడీల్లో వారు పనిచేస్తారు. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనం రూ.11,500. అంగన్వాడీ కార్యకర్త ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉంటే అన్ని సంవత్సరాలు సంవత్సరానికి 15 రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీ ఇస్తారు. కార్యకర్త 27 ఏడేళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటే రూ.1,79,135 గ్రాట్యుటీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అదే కార్యకర్త 35 ఏళ్ల వయసు కన్నా ముందే ఉద్యోగంలో చేరితే ఆమె సర్వీసు ఆధారంగా గ్రాట్యుటీ రూ.2 లక్షలు, రూ.2.50 లక్షలు ఇలా సర్వీసు కాలం ఆధారంగా పెరుగుతుంది.
ఆయాలకు ఇలా...
అంగన్వాడీ ఆయాలకు నెలకు రూ.7 వేలు వేతనంగా లభిస్తోంది. వీరు కూడా 27 ఏళ్ల సర్వీసు పూర్తి చేశారని భావిస్తే రూ.1,09,038 గ్రాట్యుటీ వస్తుంది. అదేవిధంగా గరిష్ఠ వయో పరిమితి 35 ఏళ్ల కన్నా ముందే సర్వీసులో చేరి ఉంటే దాని ఆధారంగా గ్రాట్యుటీ పెరుగుతుంది. దీని ప్రకారం రూ.1,09,038 నుంచి రూ.1.41 లక్షల వరకు గ్రాట్యుటీ లభిస్తుంది. కాగా, అంగన్వాడీ కార్యకర్తల గ్రాట్యుటీ చెల్లింపునకు రూ.10,96,30,629, ఆయాల గ్రాట్యుటీ చెల్లింపునకు రూ.6,77,12,598 మొత్తం రూ.17,73,43,218లను సంవత్సరానికి ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది.
నాడు-నేడు.. చంద్రబాబే!
2014 నాటికి అంగన్వాడీ కార్యకర్తల జీతం రూ.4,200 కాగా చంద్రబాబు రూ.6,300కు పెంచారు. తర్వాత 2019 నాటికి రూ.10500కి పెంచారు. అంగన్వాడీ ఆయాలకు కూడా అదేవిధంగా పెంచారు. రెండు విడతలుగా అంగన్వాడీ వర్కర్లకు 150ు, అంగన్వాడీ ఆయాలకు 103ు జీతం పెంచారు. 2016 అంగన్వాడీలకు ‘ఎండ్ సర్వీస్ బెనిఫిట్’ ఇచ్చారు. ఇప్పుడు అంగన్వాడీల చిరకాల డిమాండ్ అయిన గ్రాట్యుటీని పెంచుతున్నారు. ఇలా అప్పుడు, ఇప్పుడు కూడా అంగన్వాడీల సంక్షేమానికి చంద్రబాబు పెద్దపీట వేశారు. జగన్ సర్కార్ ఐదేళ్లు అంగన్వాడీలను వేధింపులకు గురి చేసింది. 45 రోజులు సమ్మె చేసినా వారి డిమాండ్లను పట్టించుకోలేదు. చర్చలపేరుతో కాలయాపన చేసింది. గత ఏడాది ఎన్నికలకు ముందు పలు అంశాలకు సంబంధించి జీవోలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో సెర్ప్, మెప్మాలు సంయుక్తంగా లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మెప్మా కింద 30 వేల మంది కొత్త మహిళా పారిశ్రామికవేత్తలను ప్రకటించనుంది.
మహిళలకు పండగే!
ఫ్లిప్‌కార్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. డ్వాక్రా సంఘాల ఉత్పత్తుల విక్రయాలకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు.
కేటలిస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసె్‌సతో సెర్ప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులపై డ్వాక్రా మహిళలకు వ్యాపార శిక్షణ అందించడంపై కేటలిస్టు మేనేజ్‌మెంట్ సర్వీసెస్ దోహద పడుతుంది.
చిన్న తరహా హోటల్ వ్యాపారంలో డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించడానికి గాటోస్ కేఫ్‌తో సెర్ప్ ఒప్పందం కుదుర్చుకోనుంది. దీనిద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి లభించనుంది. మెప్మా, హోంట్రయాంగిల్‌తో ఒప్పందం ద్వారా సర్వీస్ ప్రొవైడర్ల జీవనోపాధి అవకాశాలను పెంపొందించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 18,515 మహిళా సర్వీసు ప్రొవైడర్లకు ప్రయోజనం చేకూరుతుంది.
సర్వీసు ప్రొవైడర్లలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు, గృహోపకరణ మరమ్మతు నిపుణులు ఉంటారు.
రాపిడో సంస్థతో మెప్మా అవగాహన ఒప్పందం ద్వారా వెయ్యి ఎలక్ట్రిక్ వాహనాలను మహిళా లబ్ధిదారులకు అందించనున్నారు.
ప్రకాశం జిల్లా నుంచి 10 ఈ-బైక్‌లు, 10 ఈ-ఆటోలు లబ్ధిదారులకు కేటాయించారు. ఆన్‌బోర్డింగ్, నెలవారీ చార్జీలను 3 పాటు మాఫీ చేస్తుంది.
పీఎం విశ్వకర్మ పథకం ద్వారా వెయ్యి మంది మహిళలకు రూ.లక్ష వరకు రుణాలు అందిస్తారు.
మహిళా సంఘాల ద్వారా అరకు కాఫీ ప్రమోషన్‌కు 100 ఔట్‌లెట్‌లు, 100 కాఫీ హోటళ్లు.
నేడు ప్రకాశం జిల్లాకు చంద్రబాబు
ఒంగోలు, మార్చి 7(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ‘మహిళా దినోత్సవాన్ని’ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఉదయం 10.45 గంటలకు హెలికాప్టర్‌లో మార్కాపురం చేరుకుని, పట్టణ శివారులో నిర్వహించే మహిళా దినోత్సవ సభలో పాల్గొననున్నారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అవుతారు. అదేవిధంగా జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి...
Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..
Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ
Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..
Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..