Irrigation Board : పోలవరం, ఎత్తిపోతలను పరిశీలించిన గోదావరి రివర్ బోర్డు
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:42 AM
పరిసర ప్రాంతాల మేజర్ ఎత్తిపోతల పథకాలను గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు బృందం శనివారం పరిశీలించింది.

పోలవరం, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును, పరిసర ప్రాంతాల మేజర్ ఎత్తిపోతల పథకాలను గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు బృందం శనివారం పరిశీలించింది. బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన్ నేతృత్వంలో మెంబర్ సెక్రటరీ ఇరిగేషన్ బృందం హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంది. ఇరిగేషన్ ఈఈ ప్రేమ్‌చంద్, డీఈఈ సత్యదేవ, ఏఈఈ భద్రరావు వారికి స్వాగతం పలికారు. రోడ్డు మార్గాన తూర్పుగోదావరి జిల్లా తాడిపూడి వద్ద ఉన్న చింతలపూడి మేజర్ ఎత్తిపోతల పథకం, తాడిపూడి మేజర్ ఎత్తిపోతల పథకం, పట్టిసీమ మేజర్ ఎత్తిపోతల పఽథకాలను బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన్, ఇతర అధికారులు పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టులో గైడ్ బండ్, డయాఫ్రంవాల్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ బృందం ఆదివారం పోలవరం ప్రాజెక్టులో పవర్ హౌస్, జంటగుహలు, ఇతర ప్రాంతాలను పరిశీలిస్తుందని డీఈఈ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..