Buddhist Stupa: అపురూప శిల్ప సంపద.. అణువణువునా బౌద్ధం ఆనవాళ్లు
ABN , Publish Date - Dec 27 , 2025 | 08:31 AM
ఆంధ్రప్రదేశ్ లోని ఘంటసాల గ్రామంలో క్రీస్తు శకం ఒకటో శతాబ్దం నుంచి నాలుగో శతాబ్దం వరకు బౌద్ధమతం విరాజిల్లింది. రెండువేల సంవత్సరాల క్రితమే బౌద్ధ కేంద్రంగా, విద్య, ధ్యాన కేంద్రాలుగా ఘంటసాల గ్రామం..
ఆంధ్రజ్యోతి, ఘంటసాల: మహోన్నత బౌద్ధ క్షేత్రం ఘంటసాల గ్రామంలో క్రీస్తు శకం ఒకటో శతాబ్దం నుంచి నాలుగో శతాబ్దం వరకు బౌద్ధమతం విరాజిల్లింది. రెండువేల సంవత్సరాల క్రితమే బౌద్ధ కేంద్రంగా, విద్య, ధ్యాన కేంద్రాలుగా ఘంటసాల గ్రామం విలసిల్లింది. బుద్ధ విహారాలు, ఉపాసన మండపాలు, ధ్యాన మందిరాలు, ఇప్పట్లో బౌద్ధతత్వ చింతనకు కేంద్రంగా నిలిచాయి. క్రీలంక, బర్మా, చైనా, కొరియా వంటి దేశాల్లో బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసిన 1 దూతలు ఘంటసాలలో శిక్షణ పొంది వెళ్లారని పురావస్తు 1 పరిశోధనలో తేలింది. నేటికీ బౌద్ధం ఈ ప్రాంతంలో తీపిగురుతుగా మిగిలి ఉంది.
1870-71లో గుర్తించిన కలెక్టర్ బాస్వెల్..
ఘంటసాల గ్రామానికి ఈశాన్య దిశలో 112 అడుగుల వ్యాసం 23 అడుగుల ఎత్తు ఉన్న ఏబ్బను 1870-11 ప్రాంతంలో ఇప్పటి కలెక్టర్ బాస్వెల్ బౌద్ధ సూపంగా గుర్తించారు. బ్రిటీష్ ప్రభుత్వానికి తెలియజేశారు. పురాతన కట్టడ శాఖ సూపరింటెండెంట్ అలెగ్జాండర్‌చే 1904లో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపి స్థూపాకార పరిణామాలు, విశిష్టతను వెలుగులోకి తెచ్చారు. ఘంటసాల స్థూపం భట్టి ప్రోలు, అమరావతి, వంటి ప్రాచీన బౌద్ధ స్తూపాలను పోలిన నిర్మాణం విలక్షణమైంది.
ఈ మహా స్తూపం క్రీస్తు శకం ఒకటి, రెండో శతాబ్దాలలో నిర్మించినట్లు తెలుస్తోంది.. బుద్ధ భగవానుని పవిత్ర ధాతువు నిక్షిప్తం చేయబడిన మహా స్తూపంగా పేర్కొంటారు. ఈ మహా స్తూపాన్ని పురావస్తు శాఖ 2006 ముందు పునరుద్ధిరించారు. ఈ మహా స్థూపం చుట్టూ నాలుగు చిన్న స్థూపాలు ఉన్నాయి. కోట దిబ్బులు (ముత్యాలమ్మ దేవాలయం సమీపంలో) ఎర్నమ్మ పాళ్లు దిబ్బ (డ్వీ హైస్కూల్ సమీపంలో), దర్శగోటరు (మంటసాల పాలెంలోని గోటకం కాలనీ) పెన్నేరమ్మ దిబ్బ (దిరిశం వాని దళితవాడ పక్కన) ప్రాంతాల్లో బౌద్ధం నిరా జిల్లింది. ఈ మహా స్తూపం అమరావతిలో స్థూపం నాటిది కాగా దీని నమూనా దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదు.
ఘంటసాల పరిసరాల్లో శిల్ప సంపద
ఘంటసాల పరిసర ప్రాంతాల్లో గొప్ప శిల్ప సంపద ఉండనటానికి ఆధారంగా నిలిచిన సంఘటన 1920లో ఇది. కోటదిబ్బల సమీపంలో ఓ రైతు తన పొలం దున్నుతుండగా బౌద్ధ కిల్ప శకరాలు బయటపడ్డాయి. ప్రతి శిల్పం గౌతమ బుద్ధుని జీవితం, జాతక కథలు ప్రతి బింబించేలా ఉన్నాయి. 2014లో పిన్నేరమ్మ నిబ్బ సమీపంలో ఉన్న పొలాల్లో తవ్వకాలు జరుగుతుండగా బుద్ద భగవానుని ముఖశిల్పం లభ్యమైంది. ఈ ప్రాంతంలో లభ్యమైన విలువైన శిల్పాలు లండన్, ప్యాలెస్, మద్రాస్ తదితర ప్రాంతాలకు తరలిపోగా మిగిలిన శిల్పాలను భారత పురవస్తు శాఖ 2006 కాలచక్ర ముందు నిర్మించిన మ్యూజియంలో భద్రపరిచారు.
కంటక శైల రూపమే ఘంటసాల
ప్రాకృతి శాసనాలు ఈ ప్రాంతాన్ని కంటకోస్సిల, కంటక సోల అని పేర్కొన్నాయి. ఈ పేద్ద సంస్కృతీకరణ ఫలితమే కంటక శైల సిద్ధార్థ గౌతముని అభిమాన పాత్రమైన ఆశ్యం కంటకం, ఆంధ్ర బౌద్ధంలో ప్రాచుర్యం పొందిన చైత్యకులలోని ఒక శాఖ శైల. ఈ రెండింటి మేళవింపే కుటక శైల. కుటకశైల అపభ్రంశ రూపమే ఘంటసాల. ఘంటసాల ముఖ ద్వారంలో ఏర్పాటు చేసిన 'ఐ లవ్' ఘంటసాల ప్రాంగణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంజసాల గ్రామ ప్రాచీన వారసత్వ చిహ్నాలుగాక ఘంటసాల వెంకటేశ్వరరావు, గౌతమ బుద్ధుడు. శ్రీ జలధీశ్వరస్వామి, విగ్రహలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..
3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
Read Latest Telangana News and National News