Free Bus Travel For Women: రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితమే
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:52 AM
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికి ఉచి త బస్సు సౌకర్యాన్ని
మహిళా ఉద్యోగులు, ట్రాన్స్‌జెండర్లకూ ఫ్రీ బస్
విద్యార్థినులకు బస్ పాస్‌లు అవసరం లేదు
ఆధార్, ఓటర్, రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపవచ్చు
పల్లె వెలుగు, అల్ర్టా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీ జర్నీ: మంత్రి
15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం
రవాణా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడి
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికి ఉచి త బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రవాణాశా ఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. అంతర్రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు జీరో టికెట్‌తో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. మహి ళా ఉద్యోగులు, ట్రాన్స్‌జెండర్లకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. సోమవా రం అమరావతిలో మంత్రి మీడియాతో మా ట్లాడారు. మొత్తం బస్సుల్లో 74 శాతం బస్సులున్న పల్లె వెలుగు, అల్ర్టా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 6,700 బస్సులు ఈ కేటగిరిలోకి వస్తాయన్నారు. ఈ బస్సుల్లో ఎక్కడా సమస్యలు రాకుండా చూస్తామన్నా రు. మహిళలను ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డుల్లో ఏదైనా ఒకటి చూపినా అనుమతిస్తారని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. ‘‘ఉచిత బస్సు పథకానికి ఏటా రూ.1,950 కోట్లు ఖర్చవుతుంది. ఆటోవాలాల జీవనాధారానికి ఇబ్బంది లేకుండా త్వ రలో మంచి నిర్ణయం తీసుకుం టాం. పొరుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి.. తెలంగాణ నమూ నా ప్రకారం ఏపీలో మహిళల కు ఉచిత బస్సు విధానాన్ని అమలు చేస్తాం. బస్సు సీటింగ్‌లో ఇన్నాళ్లు మహిళలకు 35 శాతం ఉండేది. ఇప్పుడది 65 శాతానికి పెరుగుతుంది. ఉచిత బస్సుల్లో బాడీవోర్న్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. మహిళల ఆక్యుపెన్సీ 65 శాతం ఉంటుందని అంచనా వేశాం. విద్యార్థినిలు, తక్కువ జీతాలు పొందే మహిళలకు ఆసరాగా ఉంటుందని సీఎం చంద్రబాబు ఈ ఉచిత బస్సు పథకాన్ని ప్రకటించారు. ఇక మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు బస్ పాసులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. 700 స్కూల్ బస్సులు ఉదయం, సాయంత్రం నడుస్తుంటాయి. ఖాళీ సమయంలో వాటిని ఉచిత బస్సులుగా వినియోగించుకునే విషయాన్ని పరిశీలిస్తున్నాం. రానున్న కాలంలో ఎలక్ర్టిక్ బస్సులను ప్రవేశపెట్టాలని సీఎం నిర్ణయించారు. కేంద్రం 750 బస్సులు ఇచ్చింది. అదనం గా 1,400 బస్సులు కూడా రా నున్న రెండేళ్లలో కొనుగోలు చేయనున్నాం. రానున్న కాలం లో 3 వేల ఎలక్ర్టిక్ బస్సులు తెస్తాం. నాలుగేళ్లలో పర్యావరణహితంగా మారడానికి ఎలక్ర్టిక్ బస్సులు కొనాలని నిర్ణయించాం. పల్లె వెలుగు ఎలక్ట్రిక్ బస్సుల్లో ఏసీ సౌకర్యం కల్పిస్తాం. కొత్తగా నియామకాలు కూడా చేపడతాం. ఈనెల 6న క్యాబినెట్‌లో తుది ఆమోదం తీసుకుంటాం.
గత ప్రభుత్వం వల్లే ఆర్టీసీలో సమస్యలు
ఆర్టీసీ కార్గో ద్వారా ఏటా రూ.220 కోట్లు ఆదాయం వస్తోంది. ఆర్టీసీ స్థలాలను ఆదా యం, ఉపాధి కల్పించే బహుళ జాతి సంస్థలకు కేటాయిస్తాం. గత ప్రభుత్వ విధానాల వల్లే ఆర్టీసీలో సమస్యలు వస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఆర్టీసీ స్థలాలు చట్టబద్ధంగానే పరిశ్రమలకు ఇస్తున్నాం.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News