Share News

Srikakulam : మాజీ ఎంపీ ‘పాలవలస’ కన్నుమూత

ABN , Publish Date - Jan 14 , 2025 | 03:25 AM

రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పాలవలస రాజశేఖరం(77) కన్నుమూశారు.

Srikakulam : మాజీ ఎంపీ ‘పాలవలస’ కన్నుమూత

శ్రీకాకుళం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పాలవలస రాజశేఖరం(77) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఇందుమతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు పాలవలస విక్రాంత్‌ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. కుమార్తె రెడ్డి శాంతి 2019లో పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యేగా సేవలందించారు.

Updated Date - Jan 14 , 2025 | 03:26 AM