Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్లపట్టాల కేసులో వంశీకి రిమాండ్
ABN , Publish Date - May 17 , 2025 | 04:46 AM
నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 14 రోజుల రిమాండ్‌కు కింద ఉన్నారు. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. అదనంగా, అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై ₹192 కోట్ల అక్రమ లాభాల ఆరోపణలు ఉన్నాయి.
అనారోగ్యం కారణంగా వైద్య పరీక్షలకు నూజివీడు కోర్టు ఆదేశం
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ మంజూరు
అయినా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి
తాజాగా మైనింగ్ కేసు నమోదు
నూజివీడు/విజయవాడ, మే 16 (ఆంధ్రజ్యోతి): గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాత్రం ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరంలో పోటీచేశారు. విజయం కోసం బాపులపాడు మండలం కొయ్యూరు, పెరికీడు గ్రామాల్లో కొంతమందికి నకిలీ ఇళ్లస్థలాల కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ 9 మందిపై ఆ ఏడాది అక్టోబరులో హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వారిలో వంశీ పేరు లేదు. 2024లో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫిర్యాదు మేరకు ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. గతంలో వంశీ హయాంలో ఇచ్చిన ఇళ్లపట్టాలపై అధికార ముద్రలు నకిలీవని రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొనడంతో ఆయన్ను పదో నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం పోలీసులు విజయవాడ జైల్లో ఉన్న వంశీని నూజివీడు 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ర్టేట్ శ్రావణి ముందు హాజరుపరిచారు.
ఆయనతో పాటు అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకు న్యాయాధికారి 14రోజుల పాటు రిమాండ్ విధించారు. కాగా.. నూజివీడు కోర్టుకు వచ్చినప్పటి నుంచి వంశీ తీవ్రంగా దగ్గుతూ కనిపించారు. న్యాయాధికారికి తన అనారోగ్యం గురించి చెప్పడంతో.. వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించాలని ఆమె పోలీసులను ఆదేశించారు. వంశీ భార్య పంకజశ్రీ కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ.. వంశీ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు. ఇంకోవైపు.. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ 12వ అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. అయితే నూజివీడు కోర్టు రిమాండ్‌తో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంశీపై తాజాగా మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో గన్నవరం, బాపులపాడు మండలాల్లో అక్రమంగా మైనింగ్ చేశారని.. ఇందులో వంశీ, ఆయన అనుచరుడు ఓలుపల్లి మోహన రంగారావు కీలకంగా వ్యవహరించాలని కృష్ణా జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశారు. వంశీ(ఏ-1) సహా 13 మందిని నిందితులుగా చేర్చారు. అక్రమ మైనింగ్ ద్వారా వంశీ రూ.192 కోట్ల అక్రమార్జన చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News