Srikakulam farmer suicide; ఉత్తరాంధ్రలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలి
ABN , Publish Date - May 19 , 2025 | 05:47 AM
ఉత్తరాంధ్రలో గత 11 నెలల్లో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, వారి కుటుంబాలకు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదని మానవ హక్కుల వేదికలు ఆవేదన వ్యక్తం చేశాయి. జీవో 43 ప్రకారం త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టాల్సి ఉన్నప్పటికీ గ్రామాలను సందర్శించలేదని పేర్కొన్నారు.

మానవ హక్కుల వేదిక, ప్రజాసంఘాలు డిమాండ్
శ్రీకాకుళం, మే 18(ఆంధ్రజ్యోతి): ‘ఉత్తరాంధ్రలో గత 11 నెలల్లో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబాలకు ఇప్పటివరకూ న్యాయం చేకూరలేదు’ అని మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక, బీసీ సంక్షేమ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా గ్రామానికి చెందిన రైతు బల్లెడ నరసింహ మూర్తి ఆత్మహత్యకు పాల్పడారని తెలిపారు. జీవో 43 ప్రకారం ఆర్డీవో ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టాల్సి ఉందగా ఇంతవరకు కమిటీ గ్రామాన్ని సందర్శించలేదని పేర్కొన్నారు. గత 11 నెలల్లో ఉత్తరాంధ్రలో ఆత్మహత్య చేసుకున్న ఐదుగురు రైతుల కుటుంబాలకు జీవో 43 అమలుచేసి నష్టపరిహారం ఇవ్వలేదని తెలిపారు. మృతుల కుటుంబానికి తక్షణమే రూ.7లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి