Burley Tobacco Farmers Protest: రోత పత్రికపై రైతుల కన్నెర్ర
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:17 AM
నల్లబర్లీ పొగాకును కొనే దిక్కులేక ఓ రైతు ట్రాక్టర్‌తో తొక్కిస్తున్నారంటూ రోత పత్రికలో అసత్య కథనాన్ని..
నల్లబర్లీ పొగాకు విక్రయాలపై తప్పుడు కఽథనాలు
పర్చూరులో ఆందోళన.. పత్రిక ప్రతుల దహనం
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
పర్చూరు, జూలై 17(ఆంధ్రజ్యోతి): నల్లబర్లీ పొగాకును కొనే దిక్కులేక ఓ రైతు ట్రాక్టర్‌తో తొక్కిస్తున్నారంటూ రోత పత్రికలో అసత్య కథనాన్ని ప్రచురించడంపై రైతులు కన్నెర్ర చేశారు. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. బాపట్ల జిల్లా పర్చూరు బొమ్మల సెంటర్‌లో జగన్‌కు చెందిన రోతపత్రిక ప్రతులను గురువారం దహనం చేసి నిరసన తెలిపారు. పంటకు గిట్టుబాటు ధర లేక, కంపెనీలు కొనుగోలు చేయక దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం భారీగా నిధులిచ్చి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించిందని చెప్పారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషితో సీఎం ఔదార్యం చూపి కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. రాజకీయ కుట్రలో భాగంగానే జగన్ పత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్చూరు నియోజకవర్గంలో అధిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. నూతలపాడుకు చెందిన రైతు సుబ్బారెడ్డి మాట్లాడుతూ తాను పండించిన పొగాకును గోదాములో నిల్వ ఉంచానని, పాడైన పొగాకును పొలానికి ఎరువుగా ట్రాక్టర్‌తో తొక్కిస్తున్నానని చెప్పారు. దాన్ని ఫొటో తీసి జగన్ పత్రికలో తప్పుగా వార్త రాశారని ఆరోపించారు. పార్టీలకతీతంగా కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆదర్శ రైతు శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనంతరం బర్లీ రైతులు మోసపూరిత కథనాలు రాసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పర్చూరు ఎస్సై జి.వి.చౌదరికి ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్