Share News

AP Police: వంశీకి బెయిల్‌ ఇవ్వొద్దు

ABN , Publish Date - Mar 05 , 2025 | 05:01 AM

బెయిల్‌ కోసం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై పోలీసులు కౌంటర్‌ వేశా రు.

AP Police: వంశీకి బెయిల్‌ ఇవ్వొద్దు

  • బయటకు వస్తే సాక్షులను బెదిరిస్తారు

  • కేసులో కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు

  • కస్టడీలో ఆయన విచారణకు సహకరించలేదు

  • బెయిల్‌ పిటిషన్‌పై పోలీసుల కౌంటర్‌

విజయవాడ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): బెయిల్‌ కోసం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై పోలీసులు కౌంటర్‌ వేశా రు. వంశీకి ఎట్టి పరిస్థితుల్లోను బెయిల్‌ మంజూరు చేయవద్దని విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో దాఖలు చేసిన ఆ కౌంటర్‌లో విజ్ఞప్తి చేశారు. బెయిల్‌పై వంశీ బయటకు వస్తే ఫిర్యాదుదారుడిని, సాక్షులను బెదిరిస్తాడని పేర్కొన్నారు. వంశీపై గతం లో 16 కేసులు నమోదయ్యాయని వివరించారు. వంశీ ప్రణాళిక ప్రకారమే ఆయన అనుచరులు ముదునూరి సత్యవర్ధన్‌ను బెదిరించి, కిడ్నాప్‌ చేసి గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి తప్పుకునేలా చేశారని వెల్లడించారు. సత్యవర్ధన్‌ కేసులో కీలకంగా పనిచేసిన కొమ్మా కోట్లు, ఓలుపల్లి మోహనరంగారావు, ఎర్రంశెట్టి రామాంజనేయులు ఇప్పటికీ పరారీలో ఉన్నారని తెలిపారు. తనకు మూడు ఫోన్లు ఉన్నాయని వంశీ అంగీకరించినప్పటికీ వాటి ఆచూ కీ చెప్పలేదన్నారు. ఈ ఫోన్లను, సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసిన కారును వంశీ చాలా తెలివిగా మా యం చేశారని తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకోవాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటువంటి పరిస్థితుల్లో వంశీకి బెయిల్‌ ఇవ్వరాదన్నారు. కాగా, తనను సత్యవర్ధన్‌ తరఫున వాదించే న్యాయవాదిగా గుర్తించాలని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయ ణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో మంగళవారం వకాల్తా దాఖలు చేశారు. మూడు రోజులపాటు పోలీసు కస్టడీలోవంశీ విచారణకు సహకరించలేదని కౌంటర్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఆయన్ని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కౌంటర్‌లో కోరారు. కాగా, బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను గురువారానికి వాయిదా వేశారు.


  • వంశీ ప్రణాళికనే అమలు చేశాం

  • పోలీసు కస్టడీలో ఇద్దరు నిందితుల వాంగ్మూలం

సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు మంగళవారం కస్టడీకి తీసుకున్నా రు. విజయవాడలోని జిల్లా జైలు నుంచి గంటా వీర్రాజు, వేల్పూరి వంశీబాబులను కస్టడీలోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం పటమట పోలీ్‌సస్టేషన్‌లో విచారించారు. వారు తమకేమీ తెలియదని చెబుతూనే.. వంశీ ఏం చెబితే అదే చేశామని చెప్పి నట్టు తెలిసింది. వంశీ ప్రణాళిక ప్రకారం ఎవరెవరు ఏమేమి పనులు చేయాలో ఆయనకి పీఏగా వ్యవహరించిన గంటా వీర్రాజు నిర్దేశించాడు. దీనిపై పోలీసులు ప్రశ్నించగా డొంకతిరుగుడు సమాధానం చెప్పాడని తెలిసింది.

Updated Date - Mar 05 , 2025 | 05:03 AM