Ex IPS Prabhakar Raos Bail Plea: మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:23 PM
ప్రభాకర్ రావు ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలు అన్ని ఫార్మాట్ చేసి ఇచ్చారని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు(Phone Tapping Case). ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌ట్యాప్ కూడా అదే స్థితిలో ఉందని, దానిలో కూడా ఎలాంటి డేటా లేకుండా చేశారని తుషార్ మెహతా అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై(Ex IPS Prabhakar Raos Bail Plea) సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ప్రభాకర్ రావు దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సాక్ష్యాధారాలు టాంపరింగ్ చేశారని సిద్ధార్థ లూథ్రా అన్నారు.
డేటా రికవరీ చేయడానికి కూడా సహకరించడం లేదని చెప్పారు. తాను స్వయంగా వచ్చి కేసు వివరాలు అన్నీ చెప్తానని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు పాస్ ఓవర్ ఇవ్వాలని కోరారు. ప్రభాకర్ రావు ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలు అన్ని ఫార్మాట్ చేసి ఇచ్చారని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు(Phone Tapping Case). ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌ట్యాప్ కూడా అదే స్థితిలో ఉందని, దానిలో కూడా ఎలాంటి డేటా లేకుండా చేశారని తుషార్ మెహతా అన్నారు.
విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు మాట్లాడుతూ.. అధికారులు ఎన్నిసార్లు పిలిచినా ప్రభాకర్ రావు దర్యాప్తునకు హాజరైనట్లు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం కేసు విచారణ నాలుగు వారాలు వాయిదా వేసింది. ‘ప్రభుత్వం మారిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాయి కదా?’ అని జస్టిస్ నాగరత్న అన్నారు. ప్రభాకర్ రావు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ధర్మాసనం మరోసారి ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేయడానికి ప్రభుత్వానికి మరో నాలుగు వారాల సమయం ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
రోగిలా ఆస్పత్రిలోకి వచ్చి ఐఫోన్ ఎత్తుకెళ్లాడు.. 60 నిమిషాల్లోనే..
నోయిడా నిక్కి మర్డర్ కేసు.. పోలీసుల అదుపులో బావ..