Share News

YS Jagan: సీఎంల భేటీ వేళ.. సీమపై విషం చిమ్మిన జగన్

ABN , Publish Date - Jul 16 , 2025 | 06:12 PM

రాయలసీమపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి విషం చిమ్మారు. బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం సరికాదన్నారు. మిగులు జలాలపై స్పష్టత లేకుండా ఎలా అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

YS Jagan: సీఎంల భేటీ వేళ.. సీమపై విషం చిమ్మిన జగన్
YCP Chief YS Jagan

అమరావతి, జులై 16: రాయలసీమపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి విషం చిమ్మారు. న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్న సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం జాతీయ మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గోదావరిపై బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.


మిగుల జలాలపై స్పష్టత లేకుండా ఈ లింక్ ప్రాజెక్ట్‌ను ఎలా నిర్మిస్తారంటూ ఏపీ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రితో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమైన వేళ.. వైఎస్ జగన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై తెలంగాణ వాదనలకు బలం చేకూర్చేలా వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది.

రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు పోలవరం - బనకచర్ల అవసరమని ఏపీ ప్రభుత్వ ఇప్పటికే వాదిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో హంద్రీ - నీవాను గాలికొదిలేసి సీమకు వైఎస్ జగన్ అన్యాయం చేసిన విషయం విదితమే. ప్రస్తుతం పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్‌కు పురిట్లోనే అడ్డంకులు కల్పించేలా వైఎస్ జగన్ పన్నాగాలు పన్నుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మరోవైపు వైఎస్ జగన్ వ్యాఖ్యలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం విజయవాడలో స్పందించారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ అంశంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై కూటమి ఎంత చేస్తుందో చూడాలని ప్రజలకు ఆయన సూచించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడడం తమ పని అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని మీరు ఇప్పటి నుంచే కలలు కంటున్నారన్నారు. గుడ్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, వెల్ఫేర్, అభివృద్ధి.. ప్రభుత్వ విధానమన్నారు.


ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రెస్ మీట్లు చూసి ఆయన ఙ్ఞానాన్ని పెంచుకోవాల్నారు. సమాజంలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉండాలి..ప్రజలు 5 సంవత్సరాలకు సరిపడే తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. గుంతలు కూడా పూడ్చలేని ముఖ్యమంత్రి ఎలక్షన్ వాగ్దానాలు గురించి మాట్లాడుతారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. మద్యపాన నిషేధం అన్నారు..అమ్మవడి ఎప్పుడూ ప్రారంభించారని ప్రశ్నించారు. సమయం పట్టినా అన్ని హామీలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


ఫ్రీ గ్యాస్ జగన్‌కు రాలేదని అందరికీ రాలేదని అనుకుంటే ఎలా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇచ్చాపురంలో దీపం 2 పథకాన్ని ప్రారంభించామని.. తెల్లరేషన్ కార్డులు ఉన్నవారందరికీ ఇచ్చామన్నారు. ప్రజలు పక్షాన రైతులు పక్షాన మాట్లాడుతున్నామన్నా.. మీరు రూ. 1,670 కోట్లు ధాన్యం బకాయిలు ఎందుకు వదిలి వెళ్లిపోయారంటూ వైఎస్ జగన్‌ను ఆయన నిలదీశారు. రూ. 12,857 కోట్లు ధాన్యం కొనుగోలు చేశామని.. అందుకోసం రూ. 12000 కోట్లు 24 గంటల్లో రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. మీలా రైతులకు నరకం చూపలేదని.. మీ హయంలో క్రాప్ హాలిడే గోదావరి జిల్లాల్లో ప్రకటించారని గుర్తు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ముగిసిన సీఎంల భేటీ.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు

సీఆర్ పాటిల్ అధ్యక్షతన సమావేశం.. హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2025 | 06:32 PM