Share News

Tirupati: తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సు చోరీ.. చివరకు..

ABN , Publish Date - May 23 , 2025 | 10:26 AM

తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. పార్కింగ్‌లో ఉంచిన బస్సు కనపడకపోవడంతో బస్సు మేనేజర్ చివరికి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించారు.

Tirupati: తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సు చోరీ.. చివరకు..
Electric Bus

తిరుపతి: తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. చింతల చేనులో పార్కింగ్‌లో ఉంచిన ఎలక్ట్రిక్ బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయాన్నే బస్సు కనపడకపోవడంతో సంబంధిత డ్రైవర్ బస్సు మేనేజర్‌కు సమాచారం అందించారు. ఎలక్ట్రిక్ బస్సు ఎంత వెతికినా కనిపించడంతో చివరికి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు బస్సును చివరికి కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఘాట్ రోడ్డులో ఉన్నట్లు గుర్తించారు.


కడప - రాయచోటి ప్రధాన రహదారిలోని ఘాట్ రోడ్‌లో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఘాట్ రోడ్డు లోని మలుపును తిప్పలేక చోరుడు ప్రమాదానికి గురై బస్సును అక్కడే వదిలి వెళ్ళినట్లు తెలుస్తోంది. కడప జిల్లా, చింతకొమ్మదిన్నె పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, చింతల చేనులో పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ బస్సు విలువ రూ. కోటి 30 లక్షలు అని అధికారులు తెలిపారు.

కాగా, ఇటీవల కాలంలో తిరుపతి, తిరుమల కొండపై దొంగలు ఎక్కువయ్యారు. భక్తుల ఫోన్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోని వస్తువులోనూ మాత్రమే కాకుండా ఏకంగా ఎలక్ట్రిక్ బస్సును కూడా ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అంతేకాకుండా, భక్తుల ఉచిత ప్రయాణం కోసం టీటీడీ ఉపయోగించే ధర్మరథాన్ని కూడా దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన గతంలో జరిగింది. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఈ విషయాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Also Read:

వీఐ నుంచి అదిరిపోయే ఫ్యామిలీ ప్లాన్.. ఒక్కో సభ్యుడికి కేవలం రూ.299కే అదనపు సేవలు..

ఉగ్ర కుట్రలు.. రహస్య విచారణకు సన్నద్ధం

For More Telugu And National News

Updated Date - May 23 , 2025 | 11:09 AM