చుక్కలనంటిన వెండి ధర!
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:50 AM
బంగారం, వెండిపై మోజు పెరిగే కొద్దీ వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు వినియోగదా రులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. అదే బాటలో వెండి సైతం రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం మార్కెట్‌లో కిలో వెండి ధర అనూహ్యంగా పెరిగి రూ.1,72,000కు చేరింది. ఈ ఏడాది జనవరిలో వెండి ధర రూ.88,400 మాత్రమే. ఈ తొమ్మిది నెలల పదిరోజుల్లో ఏకంగా రెట్టింపు అయింది. త్వరలో కిలో వెండి రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉన్న
కిలో రూ. 1,72,000 .. రూ.2 లక్షలవుతుందని అంచనా
మార్కెట్‌లో పెరిగిన కొనుగోళ్లు.. 9 నెలల్లో రెట్టింపు
బంగారమూ పరుగే.. 22 క్యారెట్ 1,13,400
24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.1,23,710
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
బంగారం, వెండిపై మోజు పెరిగే కొద్దీ వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు వినియోగదా రులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. అదే బాటలో వెండి సైతం రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం మార్కెట్‌లో కిలో వెండి ధర అనూహ్యంగా పెరిగి రూ.1,72,000కు చేరింది. ఈ ఏడాది జనవరిలో వెండి ధర రూ.88,400 మాత్రమే. ఈ తొమ్మిది నెలల పదిరోజుల్లో ఏకంగా రెట్టింపు అయింది. త్వరలో కిలో వెండి రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉన్నట్టు మార్గెట్ వర్గాల అంచనా. రేట్లు రోజుకురోజుకు పెరుగుతుండడంతో వెండి కొనుగోలు చేసేవారి సం ఖ్య కూడా పెరిగింది. భవిష్యత్ అవసరాల కోసం ఈ కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇక బంగారం ధరలు ఇప్పటికే చాలావరకు దూసుకెళ్లాయి. బంగారం ఇక సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందని వస్తువుగా మారిపోతుందేమో అనే రీతిలో ధరలు పెరిగిపోయాయి. ఆగస్టు 29న 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.94,700గా ఉంది. రాజమండ్రి మార్కెట్‌లో గురువారం నాటికి 22 క్యారెట్ ధర రూ.1,13,800కు పెరిగింది. శుక్రవారం 400 తగ్గి రూ.1,13,400 వద్ద నిలబడింది. 24 క్యారెట్ బంగారం ధర 1,23,710గా ఉంది. ఈ ఏడా ది జనవరి 1 నాటికి 22 క్యారెట్ ధర కేవలం 71,150గా ఉంది. 24 క్యారెట్ బంగారం ధర రూ.78వేలు మాత్రమే. ప్రస్తుత ధరలు ఇంకా పెరుగుతాయనే ఆందోళనతో వెండి కిలో బార్లు, క్వాయిన్లు, బంగారం బిస్కట్ రూపంలోనూ కొందరు కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం.