Share News

ముందడుగు!

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:38 AM

మద్యం బార్ల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీకి రూపకల్పన చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో 2022-25 మధ్య అమలైన మద్యం బార్‌ల పాలసీ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం బార్‌ల పాలసీ అమలుకు గ్రీన్‌సిగ్నల్‌ పడింది. ముందస్తుగా ఈ పాలసీ అమలుకు రాష్ట్రంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఆ ఉపసంఘం ఇచ్చిన అధ్యయన నివేదిక ఆధారంగా కొత్త బార్ల పాలసీ అమలుకు శ్రీకారం చుట్టనుంది.ఈ పాలసీలో భాగంగా గీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయించనున్నారు.

ముందడుగు!

వచ్చే నెల ఒకటి నుంచి కొత్త బార్‌లు

లాటరీ విధానంలో కేటాయింపు

10 రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల

ఉమ్మడి జిల్లాలో 60 బార్లు

దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలు?

బారుకు 4 దరఖాస్తులు తప్పనిసరి

లైసెన్స్‌ ఫీజు రూ.45 లక్షలు

మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు

పర్మిట్‌ రూంలకు అవకాశం

ఈ నెల 31తో బార్ల గడువు ముగింపు

మద్యం బార్ల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీకి రూపకల్పన చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో 2022-25 మధ్య అమలైన మద్యం బార్‌ల పాలసీ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం బార్‌ల పాలసీ అమలుకు గ్రీన్‌సిగ్నల్‌ పడింది. ముందస్తుగా ఈ పాలసీ అమలుకు రాష్ట్రంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఆ ఉపసంఘం ఇచ్చిన అధ్యయన నివేదిక ఆధారంగా కొత్త బార్ల పాలసీ అమలుకు శ్రీకారం చుట్టనుంది.ఈ పాలసీలో భాగంగా గీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయించనున్నారు.

(రాజమహేంద్రవరం/ అమలాపురం -ఆంధ్రజ్యోతి)

కొత్త బార్‌ పాలసీపై అబ్కారీ శాఖ దాదా పుగా కసరత్తు పూర్తి చేసింది. త్వరలో కొత్త బార్‌లకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. జగన్‌ హయాంలో ఇచ్చిన బార్‌ల లైసెన్స్‌లకు ఈ నెలాఖరుతో కాల పరిమితి ముగుస్తుంది. దీంతో ఈనెల 15వ తేదీలోగా కొత్త బార్‌లకు సంబం ధించి నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్‌లు అందుబాటులోకి రానున్నాయి. మద్యం దుకా ణాల కేటాయింపులో గీతకార్మికులకు ప్రభుత్వం 10 శాతం షాపులు కేటాయించింది. వీరికి లైసెన్స్‌ ఫీజు సైతం భారీగా తగ్గించింది. త్వర లో బార్ల లైసెన్సుల్లోను పది శాతం కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం కేటాయించింది.

దుకాణాల్లో ధరలకే

జగన్‌ హయాంలో బార్‌లలో ధరలను బార్లా తెరిచేశారు. అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారం ధరలు పెంచుకోవచ్చని జీవో ఇవ్వడంతో అడ్డూ అదుపూ లేకుండా మందుబాబుల జేబులను గుల్ల చేశారు. వైసీపీ ప్రభుత్వం ఒకవైపు మ ద్యం ధరలను నూరుశాతం పెంచగా, బార్‌లలో దానిపై మరింత అదనంగా లాగేశారు. క్వార్ట రుకు రూ.50-రూ.70, బీర్‌కి ఏకంగా రూ.100- రూ.120 తీసుకుంటూ దోపిడీ చేశారు. ఐదేళ్లూ ఈ దందా సాగింది.ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ దోపిడీకి కొత్త మద్యం పాలసీతో అడ్డుకట్ట వేసింది. బార్‌లలో కూడా దుకాణాల్లో ధరలనే అమలుచేయాలని నిర్ణయానికి వచ్చింది. దుకా ణాల కంటే 10 శాతం ఎక్కువ ధర చెల్లించి బా ర్‌లు ప్రభుత్వ మద్యం డిపోల నుంచి కొనుగోలు చేస్తాయి.బార్‌లలో కూడా దుకాణాల ధరే నిర్ధా రిస్తే ఆ శాతాన్ని ప్రభుత్వం నష్టపోవాల్సి ఉం టుంది. దరఖాస్తు రుసుం రూ.5 లక్షలు ఉం టుందని చెబుతున్నారు.

పర్మిట్‌ రూంలు కూడా

జగన్‌ జమానాలో పిచ్చి బ్రాండ్లతో ఎంత ఆదాయం వచ్చిందో.. ఇప్పుడు దాదాపు 200 రకాల నాణ్యమైన బ్రాండ్లు ఉన్నా అంతే రాబడి నమోదవుతోంది. బీర్లలో పెరుగుదల కనిపిస్తే ఆ మేరకు మిగతా మద్యం బ్రాండ్లలో తరుగుదల నమోదవుతోంది.దీంతో ఆదాయం ఆశాజన కం గా ఉండడం లేదు. దీనిపై ప్రభుత్వం విశ్లేషణ చేయగా పర్మిట్‌ రూమ్‌లు లేకపోవడమే ఒక కారణమని తేలింది. ప్రస్తుతానికి అనధికారిక సిట్టింగ్‌లను చూసీచూడనట్టు వదిలేస్తున్నా.. ఆదాయం మెరుగుపడడం లేదు.బార్‌ల లైసె న్స్‌ల మాదిరిగానే పర్మిట్‌ రూంలకు ఈ సెప్టెం బరు నుంచి అనుమతులిచ్చే యోచనలో ప్రభు త్వం ఉంది.ఉమ్మడి జిల్లాలో 452 మద్యం దుకా ణాలు ఉన్నాయి. 2019కి ముందు అన్ని షాపు లకు ఏడాదికి రూ.5 లక్షలు ఫీజుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండు కేటగిరీలుగా చేయను న్నారు.మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రూ.7.5 లక్షలు, మిగతా ప్రాంతాల్లో రూ.5 లక్షల ఫీజు విధించే అవకాశం ఉంది. ఉమ్మడి తూర్పులో కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లు కాగా.. మిగతావి మునిసిపాలిటీలు, నగర పం చాయతీలు ఉన్నాయి. బార్‌లు, పర్మిట్‌ రూంల కు ఒకేసారి నోటిఫికేషన్‌ ఇస్తారా? లేదా వేర్వేరు గా విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

నాడంతా ‘బార్లా’

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో బార్‌ లైసెన్సుల జారీకి సిద్ధమవుతోంది. బహిరంగ వేలం ద్వారా కోట్లలో ఆదాయం వచ్చే ఛాన్స్‌ ఉన్నా అదేదీ కాదనుకుని లాటరీ ద్వారా బార్ల జారీ కి సన్నాహాలు చేస్తోంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం బార్ల కేటాయింపులో అడ్డగోలుగా వ్యవహరించింది. భారీ అప్‌సెట్‌ ధరలను నిర్ణయించి వ్యాపారుల మధ్య పోటీ పెంచిం ది. అదే సమయంలో అప్పటి అధికార పార్టీ నేతలు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే శారు. బార్ల వ్యాపారులను సిండికేట్‌ చేసి వారి నుంచి తక్కువ ధరకు కోట్‌ చేయించి తద్వారా వారి నుంచి లాగేశారు. తద్వారా పోటీ లేకుండా తక్కువ ధరకే వైసీపీ అను కూల వ్యాపారులు 2022 నుంచీ బార్లు నిర్వ హిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. గతంలో ఒక్కో బార్‌కు ప్రభుత్వం రూ.35 లక్షల ప్రారంభ ధర నిర్ణయిస్తే ఏరియా ఆధారంగా వేలంలో రూ.కోటికిపైగా పలకాల్సింది. కానీ నేతలు, వ్యాపారులు సిండికేట్‌ అయి అప్‌ సెట్‌ ధరకు పది శాతం కూడా అదనంగా రాకుండా చేసి ఉమ్మడి జిల్లాలో అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు భారీగా సంపాదిం చారు. ఒక్క కాకినాడ జిల్లాలో 15 బార్లకు వేలం నిర్వహించారు. ఒక్క కాకినాడ కార్పొ రేషన్‌ పరిధిలో 11 బార్‌లను తక్కువ ధరకు లాగేసుకున్నారు. పోటీ పెరగకుండా ఉండేం దుకు పదకొండు బార్‌లకు పద్దెనిమంది బరి లో ఉంటే అప్పటి సీటీ ఎమ్మెల్యే ద్వారంపూ డి ఏడుగురిని దారికి తెచ్చారు. వేలం నుంచి పోటీదారులను తప్పించి ఒక్కో బార్‌కు రూ.35 లక్షల ప్రారంభ ధరగా ప్రభుత్వం నిర్ణయిస్తే కేవలం రెండు లక్షలే అదనంగా వేసి రూ.37 లక్షలకు కోట్‌ చేశారు. తద్వారా భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది.

బార్లకు లాటరీ..

మద్యం షాపుల తరహాలోనే బార్లకు లాటరీ తీయాలని ప్రభుత్వం యోచిస్తోంది. జగన్‌ హయాంలో వేలం విధానంలో రెండేళ్ల పరిమితికి జారీ చేసిన లైసెన్స్‌లను గడువు ఈ నెల 31వ తేదీతో ముగుస్తోంది. ఈ నేప థ్యంలో కొత్త బార్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. లైసెన్స్‌ ఫీజుల నిమిత్తం రెండు ప్రతిపాదనలను ఎక్సైజ్‌ శాఖ సిద్ధం చేసింది. నగర పంచాయతీల్లో రూ.35 లక్షలు, మునిసిపాలిటీల్లో రూ.40 లక్షలు, నగరపాలక సంస్థల పరిధిలో రూ.45 లక్షలు మొదలు ప్రతిపాదన కాగా.. వరుసగా రూ.55 లక్షలు, రూ.65 లక్షలు, రూ.75 లక్షలు రెండో ప్రతిపాదనగా ప్రభుత్వం ముందుంచింది. అయితే ఖచ్చితంగా ఒక్కొక్క బారుకు నాలుగు దరఖాస్తులు పడాల్సిందేనన్న నిబంధన ఉంది. ప్రభుత్వం మొదటి ప్రతి పాదనకు మొగ్గు చూపుతుండగా ఆదాయం తగ్గుతుండ డంతో ఏంచేయాలో ప్రశ్నార్థకంగా మారింది.ఆ అంత రాన్ని పూడ్చడానికి బార్‌ల సంఖ్య పెంచాలని భావిస్తు న్నారు.ప్రస్తుతం తూర్పుగోదావరిలో 20, కాకినాడ జిల్లాలో 13, కోనసీమ జిల్లాలో 10 కలిపి మొత్తంగా 43 బార్లు ఉన్నాయి.ఈ సంఖ్య 60కి పెరిగే అవకాశం ఉంది.

Updated Date - Aug 06 , 2025 | 01:38 AM